Keerthy Suresh : కీర్తి సురేష్ ప్రేమలో టాలీవుడ్ యువ దర్శకుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే బాగా వైరలవుతున్న న్యూస్. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దసరా. ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో ఎలా ఎంజాయ్ చేసిందో నానీ అలాగే దర్శకుడు చెప్పుకొచ్చారు.
పేడ కలిపే సన్నివేశంలో కీర్తి చాలా సహజంగా యాక్ట్ చేసిందని చెప్పాడు నాని. అయితే, వాస్తవంగా ఈ సినిమాలో కీర్తిని తీసుకోకూడదనుకున్నాడట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. దీనికి కారణం అమ్మడు బాగా బక్కచిక్కి కనిపించడమే. మహానటి సినిమా సమయంలో కీర్తి సురేష్ ఎంత ముద్దుగా బొద్దుగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ లుక్‌లో ఈ బ్యూటీని అందరూ ఇష్టపడ్డారు.
అయితే, మరీ లావుగా ఉన్నావని కొందరు అనడంతో కరోనా సమయంలో బాగా డైట్ ఫాలో అయి నాజూకుగా తయారైంది. కానీ, అదే కీర్తికి చాలా మైనస్ అయింది. మరీ అంత జీరో సైజ్ నాజూకుతనాన్ని చాలామంది ఇష్టపడలేదు. అభిమానులు, నెటిజన్స్ ఆఖరికి సర్కారు వారిపాట టీమ్ కూడా కాస్త బొద్దుగా తయారవమని సలహాలిచ్చారు. ఇదే సమయంలో శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా కోసం అనుకొని మరీ సన్నగా ఉందని నానితో వద్దాన్నాడట.
కానీ, నాని కన్విన్స్ చేసి దసరా సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నారు. ఆ తర్వా షూటింగ్ మొదలవడం కీర్తి పర్ఫార్మెన్స్ చూసి ఏకంగా దర్శకుడు ఈ బ్యూటీతో ప్రేమలో పడటం జరిగాయని ఫన్నీగా నానీ ఈ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పాడు. నిజంగా అప్పుడు గనక వద్దనుకుంటే కీర్తి దసరా మూవీని ఎలా మిస్సయ్యేదో మేకర్స్ కూడా అలాగే కీర్తిని మిస్సయ్యేవారు. ఇక గతకొంతకాలంగా కీర్తి సురేష్ కి ఆశించిన సక్సెస్ దక్కడం లేదు. అందుకే, దసరా మూవీపై చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా గనక హిట్టైతే ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వచ్చేస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.