Chicken: చికెన్ ఈ పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లురుతాయి. ఇటీవల కాలంలో చికెన్ ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతిరోజు చికెన్ లేకుండా ముద్ద కూడా తినని వారు ఉన్నారు. అయితే చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కానీ ప్రతిరోజు ఎక్కువ మోతాదులో తినడం వల్ల పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా చికెన్ తింటూ ఉంటారు. ఇకపోతే చికెన్ ప్రతిరోజు ఒకే విధంగా కాకుండా వివిధ రకాలుగా తయారు చేసుకుని తింటూ ఉంటారు.
ఇక ఇటీవల కాలంలో చికెన్ తయారు చేసే సమయంలో చికెన్ లోకి పెరుగు వేసి మిక్స్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది చికెన్ తో భోజనం తిన్న తర్వాత వెంటనే పెరుగు వేసుకొని తినడం పెరుగులోకి చికెన్ కలుపుకొని తినడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా తినటం వల్ల టేస్ట్ బాగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అలవాటు గనుక మీకు ఉంటే వెంటనే మానుకోవాలని చెబుతున్నారు.
పెరుగు తిన్న తర్వాత చికెన్ తినడం లేదా పెరుగన్నంలోకి చికెన్ వేసుకొని తిన్నా అలా కాకుండా చికెన్ వండేటప్పుడు కూడా పెరుగు కలిపి వండినా కూడా అది మన జీర్ణ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగదని తద్వారా అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు రావడం కడుపునొప్పి వికారం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి అందుకే పెరుగు చికెన్ ఎప్పుడు కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.