Health: ప్రస్తుతం రోజుల్లో మన శారీరక ఆరోగ్యమే మనకి కొండంత ఆస్తి అని చెప్పాలి. చాలా మంది చిన్న వయస్సులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు తరుచుగా చూస్తూ ఉన్నాం. అలాగే శారీరంలో అవాంచిత పెరుగుదల కూడా కనిపిస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం లేదు. సరిగా నిద్రపోవడం లేదు. ఎనిమిది గంటల నిద్ర సమయం చాలా మందిలో సగానికి తగ్గిపోయింది అని చెప్పాలి. అలాగే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పెరిగిపోతున్న కాలుష్యంతో చాలా వేగంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. నగరాలలో కూడా అక్కడక్కడ పార్కులని అభివృద్ధి చేస్తున్నారు. పచ్చదనాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రోజువారి వ్యాయామాల మీద దృష్టి పెడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అద్యయనం చేశారు. రోజుకి 11 నిమిషాలు వాకింగ్ చేస్తే గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి రోగాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ఈ కొత్త పరిశోధనని ప్రచురించారు. వారానికి 150 నిమిషాలపాటు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఒకవేళ కుదరకుంటే ఒక 75 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఇలా చేయడం వలన చాలా వరకు అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు సమస్యల బారి నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడే ప్రమాదస్థాయి కూడా తగ్గుతుందని అంటున్నారు. అసలు ఏమీ చేయకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కంటే ఉన్న పరిధిలోనే రోజుకి కనీసం 11 నిమిషాలు వ్యాయామం, ముఖ్యంగా వాకింగ్ చేయడం వలన చాలా ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వీరు అద్యయనంలో పేర్కొన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.