Categories: HealthLatestNews

Health: భయపెడుతున్న మరో కొత్త వైరస్… ఎంత ప్రమాదం అంటే?

Health: ఏ ముహూర్తాన కరోనా మానవ సమాజంలోకి అడుగుపెట్టిందో కాని ప్రజలని మానసికంగా, శారీరకంగా బలహీనులుగా మార్చేసింది అని చెప్పాలి. చిన్న సమస్య వచ్చిన కూడా హాస్పిటల్స్ కి పరుగులు పెట్టె స్థాయిలో ఇప్పుడు ప్రజలు వణికిపోతున్నారు. రెండేళ్ళ కాలం పాటు కరోనా విజృంభించింది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఈ కరోనా నుంచి ప్రపంచం బయటపడింది అనేసరికి ఇప్పుడు మరోకొత్త  వైరస్ ఎటాక్ చేసింది. ఇన్ఫ్లూయింజా బారిన ప్రజలుపడుతున్నారు . ఇది ఒకరకమైన వైరల్ ఫీవర్స్ . హాంకాంగ్ ఫ్లూ అని పిలవబడే హెచ్ 3ఎన్2 ఇప్పుడు కొత్త వెర్షన్ లో. ఇప్పటికే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలకి దీనిపై హెచ్చరికలు జారీ చేసింది.

ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని తెలిపింది. అప్రమత్తంగా ఉండటంతో పాటు హాస్పిటల్స్ లో సరిపడ ఆక్సిజన్, బెడ్ లు రెడీ చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ఈ హాంకాంగ్ ఫ్లూ వైరస్ కారణంగా వచ్చే ఇన్ ఫ్లూయింజా ఫీవర్స్ చాలా ప్రమాధకం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇప్పటికే కర్నాటక, హర్యానా రాష్ట్రాలలో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోయారు. ఇక కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలుస్తుంది.

 

ముఖ్యంగా హాంకాంగ్ వైరస్ బారిన పడేవారిలో వ్యాధి లక్షణాలు జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం వంటివి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాంతి వచ్చినట్లు అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయని తెలిపారు. అయితే ఈ లక్షణాలు వారం రోజులకి పైగా ఉంటే కచ్చితంగా అలెర్ట్ అయ్యి హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ లు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్నారు. పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

Varalakshmi

Recent Posts

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

13 hours ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

2 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

3 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

4 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 days ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

1 week ago

This website uses cookies.