Entertainment: జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో టెలివిజన్ తెరపై కామెడీ షోలకి బాటలు వేసింది. కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే మంచి రేటింగ్స్ కూడా కామెడీ షోలకి వస్తాయని ఈ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ప్రూవ్ చేశాయి. ఈ రెండు షోల ద్వారా పదుల సంఖ్యలో కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఇక జబర్దస్త్ కి స్పూర్తిగా తీసుకొని జెమిని టీవీ ఒక కామెడీ షో స్టార్ట్ చేసిన అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. యాంకర్ శ్రీముఖితో స్టార్ట్ చేసిన ఆ కామెడీషో డిజాస్టర్ అయ్యింది. షోలో పార్టిసిపేట్ చేసే వారికి ఇచ్చే రెమ్యునరేషన్స్ తక్కువగా ఇవ్వడంతో స్టార్స్ ఎవరూ అందులోకి వెళ్ళలేదు. కొత్తవాళ్లతో ట్రై చేసిన సక్సెస్ కాలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత స్టార్ మా కామెడీ స్టార్స్ అంటూ ఒక షోని స్టార్ట్ చేసింది.
జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన దర్శకులు, అలాగే నాగబాబు కలిసి ఈ షోని స్టార్ట్ చేశారు. అయితే ఈ కామెడీ స్టార్స్ కంటిన్యూగా కాకుండా సీజన్స్ వారీగా చేస్తున్నారు. జబర్ధస్త్ నుంచి బయటకి వచ్చిన కమెడియన్స్ అందరూ ఈ కామెడీ స్టార్స్ లోకి వచ్చారు. అలాగే ఈటీవీ పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ కి కూడా కామెడీ స్టార్స్ లైఫ్ ఇచ్చింది. అయితే ఏమైందో కామెడీ స్టార్స్ సీజన్స్ కి స్టార్ మా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇప్పుడు ఒటీటీ చానల్ ఆహా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటూ కొత్త షోని తెరపైకి తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి ఈ షోకి జడ్జ్ బాధ్యతని తీసుకున్నారు. అనిల్ రావిపూడిలో కావాల్సినంత కామెడీ టైమింగ్, మంచి యాక్టర్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే ఆహా అతన్ని రంగంలోకి దించింది. ఇక యాంకర్స్ గా దీపికా పిళ్ళై, సుడిగాలి సుధీర్ ని ఎంపిక చేసింది. ఇక ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకోసం మళ్ళీ స్టార్ మా కామెడీ స్టార్స్ చేసిన కమెడియన్స్ అందరిని తీసుకొచ్చింది. జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎవరూ పెద్దగా కనిపించలేదు. మరి తెలుగులో మొదటి డిజిటల్ ఓటీటీ కామెడీ షోగా స్టార్ట్ అయిన ఈ కామెడీ ఎక్స్చేంజ్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికే ఈ షోకి సంబందించిన మొదటి ప్రోమో టెలికాస్ట్ అయ్యింది. ఈ ప్రోమోలో కమెడియన్స్ తమదైన రీతిలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం గట్టిగానే చేశారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.