Chiranjeevi : మెగాస్టార్ తీసుకునే రెమ్యునరేషన్ అంత తక్కువా..?

Chiranjeevi : టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగిన చిరంజీవి నిర్మాతల వద్ద ఏనాడు నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలి అని అడింగింది లేదని ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ మేకర్స్ చెబుతుంటారు. స్వయంగా దర్శకుడు కోడి రామకృష్ణ అయితే, ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే మాట వింటే భయపడే ఏకైక వ్యక్తి చిరంజీవి అన్నారు.

chiranjeevi remuneration per movie
chiranjeevi remuneration per movie

దీన్ని బట్టి చిరంజీవి ఆయన సినిమా కమిటయ్యే ముందు రెమ్యునరేషన్ గురించి మాట్లాడరని అర్థమవుతోంది. సుప్రీం హీరోగా ఆయనకి బిరుదిచ్చినా.. మెగాస్టార్ అని గొప్పగా పిలుచుకున్నా చిన్నపిల్లాడిలా మురిసిపోతారే గానీ ఏనాడు ఇసుమంత కూడా గర్వం చూపించింది లేదు. అందుకే, ఇండస్ట్రీలో ఆయన గాడ్ ఫాదర్ అయ్యారు. ఓ విజేతగా నిలిచారు. అన్నయ్యా..అంటే ఎలాంటి వారినైనా అక్కున చేర్చుకునే గుణం మెగాస్టార్‌ది.

Chiranjeevi : ఎవరి దగ్గరా ఆ బాసిజం చూపించకుండా అభిమానులకి ఖైదీ అయ్యారు.

కాంట్రవర్సీలకి దూరంగా అభిమానులకి దగ్గరగా ఉండే మెగాస్టార్ సామాజిక సేవలోనూ ఆచార్యుడు. మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, నా సినిమాలు చిన్నపిల్లలు ఆడవారు..అరవై ఏళ్ళు పైబడిన వారూ చూసి ఆనందించాలనే తపన కలిగిన శిఖరం. ఇండస్ట్రీలో అందరూ బాస్ అని ఎంతో అభిమానంగా పిలుచుకుంటున్నా ఎవరి దగ్గరా ఆ బాసిజం చూపించకుండా అభిమానులకి ఖైదీ అయ్యారు.

chiranjeevi remuneration per movie
chiranjeevi remuneration per movie

ఇలాంటి క్రేజ్ ఏ ఇండస్ట్రీలో ఏ మాస్ హీరోకి ఉండదంటే అందరూ నమ్మి, ఒప్పుకొని తీరాల్సిందే. ఇక మెగాస్టార్ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నా, నా షేర్ ఇంత.. అని నిర్మాతని అడగని ధర్మ గుణం చిరుది. రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తర్వాత చక చకా సినిమాలను ప్రకటించారు.

chiranjeevi remuneration per movie
chiranjeevi remuneration per movie

Chiranjeevi : అది కూడా మెగాస్టార్ స్టామినాకి తక్కువే..

ఒక్కో సినిమాను పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు అభిమానులను అలరిచకపోయినా ఈ సంక్రాంతి బరిలో దిగిన వాల్తేరు వీరయ్య సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ 200 కోట్ల వరకూ రాబట్టి ఆయన సత్తా ఎప్పటికీ ఇలాగే ఉంటుంది..జస్ట్ టైం గ్యాప్..టైమింగ్‌లో అస్సలు గ్యాప్ ఉండదు.. అని నిరూపించారు. అయితే, ఇప్పటివరకూ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 50 కోట్లు మాత్రమే అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భారీ హిట్ సాధించిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇది రెట్టింపు అయి నెక్స్ట్ మూవీ నుంచి 100 కోట్ల వరకూ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అది కూడా మెగాస్టార్ స్టామినాకి తక్కువే అనేది మెగా అభిమానుల అభిప్రాయం.

chiranjeevi remuneration per movie
chiranjeevi remuneration per movie
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago