Chiranjeevi : దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం మరికొద్ద గంటల్లో ప్రారంభం కానుంది. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం కోట్లాది కళ్లు కన్న కలలు ఇవాళ్టితో నెరవేరనున్నాయి. అయోధ్య రామ మందిరంలో ఇవాళ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరగనుంది. దేశంలోనే గొప్ప కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో భారతదేశం మొత్తం శ్రీరాముని భక్తులు సంబరాలు చేసుకుంటున్నారు. జై శ్రీరాం నామస్మరణతో కొత్త సందడిగా మారింది. వీధులన్నీ హనుమయ్య విగ్రహాలు, రామును గీతాలాపనతో ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కన్నులారా చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు. లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి అయోధ్యకు చేరుకున్నారు. మెగాస్టార్ తో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలు అయోధ్యకు వచ్చారు. ఈ క్రమంలో జాతీయ మీడియా ముందు చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
అయోధ్య రామ మందిరంలో ఘనంగా జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలను కేంద్రం పిలుపించింది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇందులో కొంతమందికి కేంద్ర సర్కార్ పెద్దలు ప్రత్యేక చొరవ తీసుకుని మరీ ఆహ్వాన పత్రికలను పంపించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవికి ఆయన కుంటుంబ సభ్యులకు అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన మరికొంత మంది సెలబ్రిటీలను కూడా పిలిచింది. రామ్ చరణ్, మోహన్ బాబు, ప్రభాస్ సహా చాలా మంది పేర్లు ఆహ్వాన లిస్టులో ఉన్నాయి. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఆయన కటుంబసభ్యులతో సహా ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు
ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ..” దేశంలో జరిగే ఈ మహోన్నత కార్యక్రమానికి ఆహ్వానం అందండం చాలా గర్వంగా ఉంది. 500 సంవత్సరాలకుపైగా యావత్ దేశం మొత్తం కన్న కల ఇవాళ ఎట్టకేలకు నెరవేరబోతుంది. ఈ అద్భుతమైన దైవ కార్యక్రమానికి కుటుంబంతో సహా నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి దైవకార్యానికి పూనుకున్న కేంద్ర సర్కార్ చొరవ ఎంతో గొప్పది కొన్ని కోట్ల మంది భారతీయుల కోరికను కేంద్రం, ప్రధాని మోదీ గారు ఇవాళ నిజం చేయబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చూడటం నా అదృష్టం. నేను హనుమంతుడి భక్తుడిని, ఆయన నాకు ఇష్టదైవం. ఆయనే ఈ దైవకార్యానికి నన్ను పిలిచాడు. ఈ నిమిషాన్ని నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను”. అని చిరంజీవి తెలిపారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.