Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచారు. పవన్ గెలుపు కోసం ఎన్డీయే కూటమితో పాటు మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. అన్న నాగబాబుతో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. పవన్ ను గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు మెగాస్టార్.
వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ..” అమ్మ కడుపున చివరన పుట్టినా అందరికీ మేలు చేసే విషయంలో పవన్ ఎప్పుడూ ముందుంటాడు. తనకంటే జనం గురించే పవన్ ఎప్పుడూ ఆలోచిస్తాడు. చాలా మంది అధికారంలోకి వచ్చాకే ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు . కానీ నా తమ్ముడు కష్టపడి సంపాదించి కూడబెట్టిన తన సొంత ఆస్తిని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వాడతాడు, బార్డర్లలో పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం విరాలం అందిస్తాడు. మత్స్యకారులకు సాయం చేస్తాడు. పవన్ చేస్తే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోంది. ఏ తల్లికైనా కొడుకు కష్టపడుతుంటే గుండె బరువెక్కుతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధగా ఉంటుంది.
నా తల్లికి ఒక మాట చెప్పా. నీ కొడుకు ఎంతో మంది తల్లులు, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తున్నాడు అని చెప్పాను. మనం పడుతున్న బాధ కంటే అది ఎంతో గొప్పది. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం. అది నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు నా తమ్ముడు. తన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయానికి అంకితం చేశాడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో తమ్ముడి గొంతును మనం వినాలి. తమ్ముడు ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా అండగా నిలబడతాడు. మీ కలను నిజం చేస్తాడు”అని చిరంజీవి భావోద్వేగమైన వీడియో చేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.