Chiranjeevi: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యే ఎంతో మంది యువ హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు మెగా స్టార్ . చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి దాదాపు అరడజను మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. తమ్ముళ్లు నాగబాబు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ప్రవేశించి తమ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో నిలదొక్కుకుంటున్నారు.
అయితే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి కారణంగా నష్టపోయారట. అవునా నిజామా అదెలా అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా అల్లు అర్జునే చెప్పాడు. అయితే అల్లు అర్జున్ మెగాస్టార్ డాన్స్ కారణంగా డబ్బులు పోగొట్టుకున్నాడాట. చిరంజీవి డాన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఇంద్ర మూవీ సమయంలో అల్లు అర్జున్ కి , తన ఫ్రెండ్ కి మధ్య ఓ చిన్న డిస్కషన్ జరిగిందట.
‘దాయి దాయి దామా’ సాంగ్ లో చిరంజీవి వీన స్టెప్ హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఆ స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన హీరోయిన్ సోనాలి బింద్రే ఉందని అతని ఫ్రెండ్ .. లేదని అల్లు అర్జున్ ఇద్దరు వాదించుకున్నారట. బన్నీ ఇంద్ర సినిమాను అప్పట్లో 17 సార్లు చూసాడట . దీనితో ఆ సాంగ్ లో చిరంజీవి ఒక్కరే స్టెప్ వేశారని మొండిగా వాదించాదట. అంతే కాదు 25 వేలు రూపాయలు బెట్ కూడా కట్టాడట . కానీ చివరికి వీడియో చూస్తే చిరూ పక్కనపాటలో సోనాలి బింద్రే కూడా వీణ స్టెప్ వేసింది. అప్పుడు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పిందే నిజమని ఒప్పుకున్నాడట. ఈ పాటలో చిరంజీవిని మాత్రమే చూసానని హీరోయిన్ వైపు చూపు కూడా వెళ్లలేదని చెప్పాడట . అలా మెగాస్టార్ కారణంగా అల్లు అర్జున్ 25 వేలు నష్టపోయారట.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.