Chat GPT: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచంలో టెక్ కంపెనీలకి గొప్ప వరంగా మారగా, టెక్ ఉద్యోగాలతో పాటు డిఫరెంట్ సెక్టార్ లలో ఉద్యోగాలు చేస్తున్న వారికి శాపంగా మారబోతుంది. ఇప్పటికే అన్ని కంపెనీలు AI వినియోగం దిశగా అడుగులు వేస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, కంపెనీలు ప్రస్తుతం ఒక పరిధి మేరకు AIని వినియోగించుకుంటున్నాయి. భవిష్యత్తులో వ్యాపార లావాదేవీలు అన్ని కూడా అంతర్జాలం ద్వారానే జరగబోతున్నాయి అని ఇప్పటికే స్పష్టం అవుతుంది. అలాగే మ్యానిఫేక్చరింగ్ కంపెనీల నుంచి వాటిని మార్కెట్ చేసే అడ్వర్టైజింగ్ కంపెనీల వరకు అన్ని కూడా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
దీని ద్వారా హ్యూమన్ మెన్ పవర్ తగ్గించుకునే అవకాశం తగ్గుతుంది. ఆర్ధిక బారం తగ్గించుకునే దిశగా ఇప్పటికే అన్ని రంగాలలోని కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం పెరిగితే లక్షల్లో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని విభాగాలకి చెందిన ఉద్యోగాలు కనుమరుగు అవుతాయి. ప్రస్తుతం హ్యూమన్ పవర్ తో నడుస్తున్న ఆయా విభాగాలలో AIని సమర్దవంతంగా వినియోగించుకునే ప్రయత్నంలో కంపెనీలు ఉన్నాయి.
ఇక భవిష్యత్తులో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటిటీవ్, కంటెంట్ రైటర్, ట్రాన్స్ లెటర్, డేటా ఎంట్రీ వర్క్, సోషల్ మీడియా మేనేజర్, విర్చువల్ అసిస్టెంట్,టెక్నికల సపోర్ట్ స్పెసలిస్ట్, కాపీ ఎడిటర్, పెర్సనల్ అసిస్టెంట్, పీచ్ రైటర్, బ్లాగర్, రీసెర్చ్ అనలిస్ట్, ప్రూఫ్ రీడర్, క్రియేటివ్ రైటర్, ట్రావెల్ ఏజెంట్, లీగల్ రీసెర్చర్, హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్ , మార్కెటింగ్ అనలిస్ట్, కాల్ సెంటర్ రిప్రజెంటిటీవ్ ఉద్యోగాలు చేసే వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారబోతుంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కొత్త రంగాలలో ఉద్యోగాలని సృష్టిస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే దానికోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడంతో పాటు. క్రియేటివ్ నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.