Chandrababunaidu-TDP: బాబుకి బెయిల్ వచ్చినా లాభం లేదా..? ఇప్పుడు ఇదే అటు టీడీపీ వర్గాలలో గానీ, ఇతర పార్టీ నాయకుల్లో గానీ, ప్రజల్లో గానీ వినిపిస్తున్న మాట. ఎన్నో కఠిన ప్రయత్నాల తర్వాత చివరికి టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. ఇది కూడా మధ్యంతర బెయిల్ కావడం పెద్ద ట్విస్ట్. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బాబు మళ్ళీ జైలుకు చేరుకోవాలి. ఈ కండిషన్ ప్రకారమే బాబుకి వచ్చి జైలు నుంచి మాత్రమే బయటకు తీసుకొచ్చింది.
ఆయన హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆయన కావాలనుకున్న ఆసుపత్రిలో కంటికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యం చేసే విధంగా రాజకీయ సమావేశాలు పెట్టకూడదు.. పాల్గొనకూడదు. పార్టీ నేతలతో సమావేశం కూడా కాకూడదు. ఇదే ఇపుడు యూహాలకి కష్టంగా మారింది. బెయిల్ వస్తే చంద్రబాబు టీడీపీ నేతలతో కలిసి మీటింగులు పెట్టి పార్టీని బలోపేతం చేస్తూ మళ్లీ జనంలోకి తీసుకెళ్తారని ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో బాబు దేనికోసం అయితే బెయిల్ కోరారో ఆ పనులు మాత్రమే చూసుకోవాలని కోర్టు ఖచ్చితంగా ఆదేశించింది.
చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలు వెంటే ఉంటారు. అయినా ఆయన కనుసన్నలలో జరిగేవి జరుగుతూనే ఉంటాయని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఆయన సంకేతాలు ఇస్తుంటారట. పార్టీ నేతలకు అందాల్సిన సమాచారాన్ని ఇస్తూ పార్టీని నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మీద నవంబర్ 10వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. అంతకన్నా ముందు సుప్రీం కోర్టు నవంబర్ 8న క్వాష్ పిటిషన్ మీద తీర్పును ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాష్ పిటిషన్ కొట్టేస్తే గనక బాబు గారు అనుకుంటున్న న్యాయం జరిగినట్లే. అన్యాయంగానే కేసు పెట్టారని బలంగా మాట్లాడవచ్చు. చూడాలి మరి రేపటి నుంచి బాబు వ్యాహాలు ఎలా ఉండబోతున్నాయో.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.