Chandrababu: వచ్చే ఎన్నికలలో ఎలా అయిన అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ దిశగా తన వ్యూహాలని పదును పెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. తనయుడు నారా లోకేష్ కి కూడా కీలక బాద్యతలు అప్పగించిన చంద్రబాబు ఓ వైపు రాయలసీమలో పాదయాత్రతో నియోజకవర్గాల వారీగా బలాబలాలని బెరేజు వేసుకుంటున్నారు. అభ్యర్ధులని ప్రకటించే బాధ్యతని లోకేష్ కి అప్పగించారు. మరో వైపు రీజనల్ సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ని ఉత్సాహపరుస్తూ వెళ్తున్నారు. ఇదే సమయంలో సుమారు 75 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్ధులను ప్రకటించేశారు. ఎన్నికలకి ఏడాది ముందే ఇలా అభ్యర్ధులని ఖరారు చేయడం పార్టీకి సానుకూలంగా మారనున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
నేతలపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని అన్నీ సర్వే రిపోర్టులను చూసుకుని అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రాబిన్ శర్మ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నారు. ఆ టీమ్ మొత్తం టీడీపీ నాయకుల బలాలని పరిశీలిస్తోంది. ప్రకటించిన అభ్యర్ధులను మార్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే జనసేనతో పొత్తు ఖాయమైతే కొన్ని స్థానాలకి అభ్యర్ధులని మార్చొచ్చు అని భావిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందనే విధంగానే వారికి బలం ఉన్న స్థానాలని విడిచి పెట్టి చంద్రబాబు ప్రస్తుతానికి అభ్యర్ధులని ఖరారు చేస్తున్నారు.
అయితే పొత్తులపై తమ్ముళ్ళ అభిప్రాయాలని పరిగణంలోకి తీసుకొని వెళ్ళాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. కొంత మంది తెలుగుదేశం నాయకులు జనసేనతో పొత్తు లేకపోయిన ఎన్నికలలో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం పొత్తుతోనే వెళ్లాలని భావిస్తోంది. అవసరం అయితే బీజేపీని కూడా దగ్గర చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే జనసేనాని నిర్ణయంపై స్పష్టత లేకపోవడంతోనే తన పంథాలో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు అనే మాట వినిపిస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.