Chandrababu: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సీబీఐ విచారణ వేగవంతం చేయడం, అందులో నిందితులు, అనుమానితులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని చేర్చడం జరిగింది. దీంతో గత ఎన్నికలకి ముందు వివేకానంద రెడ్డి హత్య టీడీపీ చేయించింది అని ప్రచారం చేసుకొని లబ్ది పొందిన వైసీపీకి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలతో వైసీపీ నాయకులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, చంద్రబాబు దీనినే ఆయుధంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందని హత్య చేసి తమ రాజకీయాలకి జగన్ రెడ్డి వాడుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారని అన్నారు. వివేకానంద హత్య కేస్ అనేది ఒక కేస్ స్టడీ లాంటిది అని పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు సీబీఐని మ్యానేజ్ చేసి ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్రలు చేస్తుననరంటూ విమర్శలు చేస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ చేయకుండానే భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేర్చింది అంటూ వాదిస్తున్నారు. అసలు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి వివేకానంద హత్యతో సంబంధమే లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డిని బయటకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విదేశీ పర్యటన సైతం రద్దు చేసుకొని ఉన్నపళంగా ఢిల్లీ టూర్ వెళ్ళడానికి జగన్ రెడీ అవుతూ ఉండటం వెనుక వివేకానంద కేసు విషయమే ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం సలహాదారు సజ్జల మాత్రం వైసీపీ నాయకులని ఇరికించడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందనే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తలనొప్పిగా మారితే టీడీపీకి ఆయుధంగా మారిందని చెప్పాలి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.