Chandra Mohan: చంద్ర‌మోహ‌న్ జీవితంలో అదొక్కటే పెద్ద అసంతృప్తి..ఏంటో తెలుసా..?

Chandra Mohan: చంద్ర‌మోహ‌న్ జీవితంలో అదొక్కటే పెద్ద అసంతృప్తి..ఏంటో తెలుసా..? ప్ర‌ముఖ తెలుగు సినీ న‌టుడు చంద్ర‌మోహ‌న్ (81) ఈరోజు (11.11.23) అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైదరాబాద్ అపోలో ఆస్ప‌త్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలిసి తెలుగు చిత్ర‌పరిశ్రమలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విషాద చాయ‌లు చుట్టుకున్నాయి. ఇక చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్ర‌ముఖులంతా ఆయ‌న‌కు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. కాగా, సోమ‌వారం(13.11.23) హైద‌రాబాద్ లో చంద్ర‌మోహ‌న్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

చంద్రమోహన్ చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా సినిమాలు చేసే అవకాశం అందుకున్నారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి అగ్ర తారలతో ఆయన హీరోగా నటించారు. హీరోగా మాత్రమే కాకుండా అవకాశం వచ్చిన ప్రతీ సినిమాలో న‌టించి మెప్పించారు. ఇక ఇప్పటి త‌రం హీరోల‌కు తండ్రిగా, తాతగా కూడా న‌టించి ఆకట్టుకున్నారు.

chandra-mohan-That is the only major dissatisfaction in Chandramohan’s life..you know what..?

Chandra Mohan: ప్రేక్ష‌లోకానికి తెలియనివి ఎన్నో విష‌యాలు ఉన్నాయి.

అయితే, చంద్ర‌మోహ‌న్ గురించి ప్రేక్ష‌లోకానికి తెలియనివి ఎన్నో విష‌యాలు ఉన్నాయి. ఆయన కృష్ణ‌జిల్లా ప‌మిడిముక్క‌ల‌లో 1943లో పుట్టారు. అస‌లు పేరు మ‌ల్లంపల్లి చంద్ర‌శేఖ‌ర్ అయితే, సినిమాల్లోకి వ‌చ్చాక చంద్ర‌మోహ‌న్ గా పేరు మార్చుకున్నారు. ఇక ఆయన విద్యాభ్యాసం బాపట్లలో సాగింది. అక్కడ ఉన్న వ్యవసాయ కాలేజీలో ఢిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చంద్రమోహన్ నటించిన మొదటి సినిమా ‘రంగుల రాట్నం’. ఇది 1966లో విడుదలైంది. ఈ క్రమంలోనే తమిళ సినిమాలలోనూ అవకాశాలు దక్కించుకున్నారు

చంద్రమోహన్ నటనకు గానూ ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు దక్కాయి. అయితే, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు ఉన్న అసంతృప్తి ఒక‌టేన‌ని తెలిపారు. ప్ర‌జాభిమానాలే త‌న‌కు అవార్డులు రివార్డులు అని.. త‌న సీనియ‌ర్లు సావిత్రి, క‌న్నాంబ‌, ఎస్వీ రంగారావు, సూర్య‌కాంతం లాంటి గొప్ప న‌టీన‌టులు ఉంటే వారికి ఇలాంటి అవార్డులు దక్కలేదని తెలిపారు. వీరికి గనుక అవార్డులు ఇచ్చి ఉంటే, ఆ అవార్డుల‌కే గౌర‌వం వ‌చ్చేద‌ని చెప్పుకొచ్చారు. మన ఇండస్ట్రీలో ప్ర‌తిభ ఉన్న‌వారు ఎంతోమంది ఉన్నారు. వారికే పద్మ‌శ్రీ పుర‌స్కారాలు ద‌క్క‌లేదు. కాబట్టి ఆ పురస్కారాలపై నాకు ఆసక్తి లేదని తెలిపారు చంద్రమోహన్.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

11 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

13 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.