Chandra Mohan: 100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న వారిలో పూరి కంటే ముందు చంద్రమోహన్ అనే విషయం తెలుసా..? ఈ విషయం చాలామందికి తెలీదు. ఒక దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లకి పైగా పోగొట్టుకున్న వారిలో పూరి జగన్నాద్ గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకంటే, ఈ విషయం ఆయనే పలు సందర్భాలలో స్వయంగా చెప్పారు కాబట్టి. కానీ, ఆయనకంటే ముందు ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ 100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారట.
సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతూ నేడు శనివారం (11.11.2023) హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు ఇతర భాషలలోనీ ప్రముఖులందరూ ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఆయన మృతి చెందిన నేపథ్యంలో ఎన్నో విషయాలు బయటకి వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఇటీవల చంద్రమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు చెప్పినా వినకుండా రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను అని. చంద్రమోహన్ చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
చంద్రమోహన్ హీరోగా 175 సినిమాలు చేశారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల లెక్క తెలియదు. అయితే, చంద్రమోహన్ కి అప్పట్లో రెమ్యునరేషన్ బాగానే ఇచ్చేవారట. ఆయన సతీమణి జలంధర కూడా మంచి రచయిత్రి. 2022లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దంపతులిద్దరు చంద్రమోహన్ సినిమా కెరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నరు. అప్పటి స్టార్ హీరోయిన్లు అందరూ చంద్రమోహన్ ను లక్కీ స్టార్ గా చెప్పుకునేవారు. చంద్రమోహన్ సరసన నటిస్తే పెద్ద స్టార్ అయిపోతామనే బలమైన నమ్మకం ఉండేదట.
అంతేకాదు చంద్రమోహన్ చేతులతో ఒక్క రూపాయి అయినా తీసుకోవాలి అని ఆరాటపడేవారట. ఇదే విషయాన్ని ఆయన సతీమణి జలంధరచెప్పారు. ఇదే సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ అప్పట్లో తాను 100 కోట్ల రూపాయల ఆస్తిని ఎలా పోగొట్టుకున్నాడో వివరించారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.