Banana: మనకు అన్ని రకాల సీజన్లలో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండును మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు అరటి పండులో ఎన్నో రకాల విటమిన్స్ ఖనిజలవణాలతో పాటు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అందుకే అరటిపండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా ఏ విధమైనటువంటి జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా కాపాడుతుంది.
ఇక అరటి పండు రాత్రి భోజనం తర్వాత తినటం వల్ల జీర్ణక్రియ మంచిగా జరుగుతుందని భావిస్తారు అయితే రాత్రిపూట అరటిపండ్లు తినటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారు అనే అపోహ కూడా అందరిలోనూ ఉంది. మరి నిజంగానే రాత్రిపూట అరటిపండు తిని పడుకోవటం వల్ల శరీర బరువు పెరుగుతారా ఇందులో ఎంతవరకు నిజముంది ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే..
రాత్రిపూట అరటి పండ్లు తిని పడుకోవటం వల్ల బరువు పెరుగుతారు అనేది కేవలం అపోహ మాత్రమే అందులో ఏమాత్రం నిజం లేదు.అవి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కేవలం రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరగరని గమనించడం ముఖ్యం. రోజు సమయంతో సంబంధం లేకుండా, మీరు మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు బరువు పెరుగుతారు. అరటిపండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కనుక ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా అరటిపండు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.