Bollywood: బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ ప్రేమ పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రిలేషన్ షిప్ లు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంత మంది హీరోయిన్స్, హీరోలు ఒకరి కంటే ఎక్కువ మందితో రిలేషన్ షిప్ పెట్టుకుంటారు.
ఒకరికి బ్రేక్ అప్ ఇచ్చిన తర్వాత మరో హీరోయిన్ తో డేట్ చేయడం అనేది అక్కడ సర్వసాధారణంగా జరుగుతుంది. అలాగే చాలా మంది లవ్ కపుల్స్ గా పార్టీలకి కలిసి అటెండ్ అవుతూ ఎట్రాక్షన్ గా ఉంటారు. అయితే చాలా ప్రేమ కథలు బాలీవుడ్ లో పెళ్లి వరకు వెళ్ళకుండానే ముగిసిపోతూ ఉంటాయి.
కొద్ది మంది మాత్రం తమ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో పెళ్లి వరకు వెళ్ళిన ప్రేమ జంటలని చూసుకుంటే దీపికా పదుకునే, రణవీర్ సింగ్, అలియా భట్, రణబీర్ కపూర్ కనిపిస్తారు. వీరు పెళ్లి వరకు వెళ్ళిన రిలేషన్ కి ఆయా స్టార్స్ కి ఇది మొదటి ప్రేమ కథ అయితే కాదు. కాని ఇప్పుడు వాళ్ళు జంటలుగా మారి పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఉంది. అయితే ఆ ప్రచారాన్ని వారు ఎప్పుడూ ఖండించలేదు. అలాగే సమర్ధించలేదు. చాలా సార్లు మీడియా నుంచి వీరికి ప్రశ్నలు ఏదైనా కూడా వాటిని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక వారు జంటగా మీడియా కంటికి చిక్కింది కూడా చాలా తక్కువ.
అయితే వీరు తమ ప్రేమ విషయాన్ని దృవీకరించపోవడంతో అదంతా గాసిప్ అని అందరూ అనుకునేవారు. అయితే ఊహించని విధంగా వీరిద్దరూ రాజస్థాన్ లో జైసల్మీర్ లో పెళ్లి పీటలు ఎక్కారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే వీరి పెళ్లి వేడుకకి హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత వీరి ఫోటోలని తమ ఇన్స్టాగ్రామ్ లో కియరా, సిద్దార్థ్ షేర్ చేసి జీవితంలో తామిద్దరం కలిసి ప్రయాణం మొదలు పెట్టాం అని. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు.
ఇక ఈ పెళ్లిపై బాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా విషెస్ చెప్పారు. కంగనా రనౌత్ కూడా వీరి పెళ్లిపై స్పందించారు. బాలీవుడ్ లో చాలా జంటల మాదిరిగా కాకుండా వీరు నిజమైన ప్రేమబంధాన్ని కలిగి ఉన్నారని, ప్రచారాల కోసం డేటింగ్ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని కొనియాడింది. వీరిద్దరూ నిజంగా పెళ్లిదుస్తులలో దేవతల మాదిరిగా కనిపిస్తున్నారు అంటూ ప్రసంసించింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.