Politics: ఒక వ్యక్తి దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన, అలాగే ఇల్లీగల్ వ్యవహారాలతో ధనార్జన చేస్తున్నారని తెలిసినా, ఎవరో ఒకరి ఫిర్యాదు ఆధారంగా పక్కా సాక్ష్యాలతో ఐటీ దాడులు చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఐటీ దాడులు అనేవి అధికార పార్టీ ప్రత్యర్థులపై ప్రయోగించి రాజకీయ అస్త్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రత్యర్థులపై ఎక్కువగా ఐటీ దాడులు చేయిస్తూ భయపెట్టి తమదారిలోకి తెచ్చుకుంటున్నారు అనే విమర్శలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆరోపణలకి బలం చేకూరే విధంగా కేంద్రం ఆధీనంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ముఖ్యంగా బీజేపీకి ప్రత్యర్ధులుగా ఉన్న పార్టీలలోని నాయకుల మీదనే దాడులు చేస్తూ ఉంటారు. వారి దగ్గర ట్యాక్స్ లెక్కల్లో లేని ఆస్తులు ఉన్ననాయని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఈ ఐటీ రైడ్స్ రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇప్పుడు బీజేపీలో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలపై తమ రాజకీయ అస్త్రాలని ప్రయోగిస్తోంది. డబ్బు, పదవులు అని ముందుగా ఆశ చూపించే ప్రయత్నం చేస్తుంది. వాటికి లొంగకపోతే ఇక ఐటీ దాడులతో భయపెడుతుంది. మునుగోడు ఎన్నికల ముందు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకి తెరతీసింది అంటూ కేసీఆర్ ఆధారాలతో సహా చూపించాడు. గతంలో ఎమ్మెల్సీ కొనుగోళ్ల వ్యవహారంలో చంద్రబాబుని ఇరుకున పెట్టి తెలంగాణ వదిలి ఏపీలోకి వెళ్లిపోయేలా కేసీఆర్ చేయగలిగారు. దానిని పకడ్బందీగా అమలు చేసి చంద్రబాబుని తెలంగాణ నుంచి సాగనంపడంతో పాటు ఆ పార్టీ నాయకులని టీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.