Politics: తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తన ఉనికిని మరింత విస్తృతం చేసుకోవడానికి అన్ని దారులని వెతుకుతుంది. ఏ ఒక్క అవకాశం వదలడం లేదు. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి నాయకులతో బలం పుంజుకుంది. అసలు డిపాజిట్స్ రాని స్థాయి నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అనే రేంజ్ కి వచ్చింది. రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి కేసీఆర్ కి గట్టి పోటీ ఎదురవుతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దానికి తగ్గట్లుగానే బీజేపీ రాజకీయ వ్యూహాలని అమలు చేసుకుంటూ వెళ్తుంది. 2023 ఎన్నికలలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.
ఇక ఏపీలో ఇప్పటికిప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీతో దోస్తీ చేస్తూనే రాజకీయాలు చేస్తున్నారు. 2024 ముందు విభేదాలు వచ్చి బీజేపీకి దూరంగా వచ్చి పోటీ చేసిన ఫలితం పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో ఫెవర్ గా రాలేదు. ఘోరమైన ఫలితాలు చూసారు. అయితే ఎన్నికల తర్వాత మరల బీజేపీతో కలిసి పని చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం కూడా బీజేపీతోనే కలిసి ఎన్నికలకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వైసీపీని ఎలా అయిన గద్దె దించాలి అని టీడీపీతో కూడా జత కడితే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. దానికి బీజేపీ పార్టీ నుంచి మద్దతు రావడం లేదు.
ఇక తాజాగా విశాఖలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కలిసిన తర్వాత తన ఆలోచన కూడా మార్చుకున్నాడు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఒక్క అవకాశం జనసేనకి ఇవ్వండి అనే నినాదం ఎత్తుకున్నట్లు వినిపిస్తుంది. రీసెంట్ గా అమిత్ షాతో కూడా పవన్ కళ్యాణ్ కలిసి చర్చించారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు బీజేపీ నిర్ధేశించిన మార్గంలోనే వెళ్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. మోడీ, అమిత్ షాలతో ఉన్న బంధం కారణంగా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ క్షేత్రంలో ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇది బీజేపీ పార్టీకి లాభించే అంశమే.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అనే గౌరవ పురస్కారం ఇచ్చి లెజెండ్స్ జాబితాలో చేర్చింది. దీని వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందనే మాట వినిపిస్తుంది. చిరంజీవికి అవార్డు ఇవ్వడం ద్వారా మెగా అభిమానులతో పాటు, జనసేన పార్టీలో బీజేపీకి కొంత వ్యతిరేకంగా ఉన్న వారిని సంతృప్తి పరిచినట్లు అయ్యింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో బలమైన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని తమవైపుకి తిప్పుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా మార్చుకున్నారు. తెలంగాణలో కూడా చిరంజీవిని అభిమానించే లక్షలాది మంది అభిమానులు బీజేపీ వైపుకి వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇలా తెలుగు రాష్ట్రాలలో అటు రాజకీయాలలో, ఇటు సినిమా పరంగా బలమైన ఐడెంటిటీ వ్యక్తులుగా ఉన్న అన్నాదమ్ములని తమ చేతిలో ఉంచుకొని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలో బలమైన శక్తిగా ఎదగడానికి బీజేపీ బాటలు వేసుకుంటుంది అనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.