Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా దానికి బాధ్యుడు పుష్ప 2 చిత్ర నిర్మాతలు, అల్లు అర్జున్ అని సీవీ ఆనంద్ ఈరోజు (డిసెంబర్ 13) ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రిలో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కేసు పరిశీలించిన కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనని చంచల్ గూడా జైలుకి తరలించారు. దాంతో అందరూ సోమవారం వరకూ అల్లు అర్జున్ కి బెయిల్ ప్రయత్నించినా రావడం చాలా కష్టమని భావించారు. సోషల్ మీడియాలో, పలు మీడియా ఛానళ్ళలో ఈ విషయమై జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ హుఠాహిటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. చిరంజీవి షూటింగ్ కూడా ఆపేసి వచ్చారు. అంతేకాదు, అల్లు అర్జున్ అరెస్ట్ ఇటు తెలంగాణా అటు ఏపీ రాజకీయ నాయకుల్లో, ప్రజల్లో ప్రకంపనలు సృష్ఠించింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అరెస్ట్ ని ఖండిస్తూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
కాగా, సినిమాని తలపించిన అల్లు అర్జున్ కి అరెస్ట్ కొద్ది గంటల్లోనే హైకోర్ట్ నుంచి బెయిల్ మంజూరు కావడం ఓ పెద్ద డ్రామాగా క్రియేట్ అయింది. హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మొత్తానికి అల్లు అర్జున్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఆయన్ని అనవసరంగా కావాలనే అరెస్ట్ చేశారని వినిపించిన వాదనలే నిజమైనట్టు అనిపిస్తోంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.