Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శన కి వచ్చిన ఓ కుటుంబంలోని రేవతి అనే మహిళ అల్లు అర్జున్ చూసేందుకు జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది.

దీనికి కారణం సంధ్య థియేటర్స్ యాజమాన్యం, పోలీసుల అసమర్ధత అలాగే అల్లు అర్జున్ బాధ్యత వహించలేదనే కారణాలను చూపెడుతూ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని డిసెంబర్ 13న తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

big-breaking-allu-arjun-released-from-chanchalguda-jail-today-at-6-am

Big Breaking: ఈరోజు ఉదయం 6 గంటలకి ఆయన జైలు నుంచి బయటకి అల్లు అర్జున్

దాంతో అల్లు అర్జున్ తరపున న్యాయవాది హైకోర్టులు పిటీషన్ వేయగా 50 వేల బాండ్ ఏదైనా సమర్పించి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ, బెయిల్ కి సంబంధించిన పేపర్స్ జైలు అధికారులకి అందలేదని ఆయనను నిన్న రాత్రంతా జైలులోనే ఉంచారు. హైకోర్టు విడుదల ప్రకటించినప్పటికీ సరైన సమయానికి డాక్యుమెంట్స్ అందకపోవడంతో అల్లు అర్జున్ విడుదలలో జాప్యం జరిగింది.

ఎట్టకేలకి ఈరోజు ఉదయం 6 గంటలకి ఆయన జైలు నుంచి బయటకి వచ్చి తన కారులో ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని ఇన్నాళ్ళు నెగిటివ్ గా వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రూ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ దంపతులు, నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ద్వారా పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతోంది. కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అంటూ ఆయన పోస్ట్ లో రాసుకొచ్చారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

16 hours ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

17 hours ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

18 hours ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

19 hours ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

1 week ago

Sreeleela: ఐటెం గాళ్ గా అంటే..ఆలోచించాల్సిందే

Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…

2 weeks ago

This website uses cookies.