Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా బౌమ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య జూలై 14 వ తేదీ వచ్చిన నేపథ్యంలో నేడు కుజదోష నివారణలు చేయించుకోవాలనుకునే వారు అలాగే పితృ దోషాలతో బాధపడే వారికి ఎంతో అనుకూలమైన రోజని చెప్పాలి. మరి అమావాస్య తిథి ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉంది ఈరోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయానికి వస్తే..
అమావాస్య తిథి ప్రారంభం – 13 జూలై 2026, సోమవారం సాయంత్రం 06:32 గంటలకు ప్రారంభమై 14 జూలై 2026, మంగళవారం మధ్యాహ్నం 04:08 గంటలకు పూర్తికానుంది. జూలై 14వ తేదీ ఉదయమే స్నానాలు ఆచరించి పలు పరిహారాలను పాటించాలి ముఖ్యంగా అమావాస్య అంటే పితృ దేవతలకు ప్రీతికరమైన రోజు. పితృ దోషాలతో బాధపడేవారు నది స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదలాలి అదేవిధంగా నువ్వులు , వస్త్రాలు, అన్నం వంటివి ధానం చేయటం వల్ల పితృ దోషాల నుంచి విముక్తి కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది. కుజ దోష నివారణకు కూడా ఈ అమావాస్య ఎంతో అనుకూలం కుజ దోషంతో బాధపడేవారు ఈ చిన్న పరిహారాలను పాటిస్తే సరి..
కుజదోషంతో బాధపడేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం లేదా ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా హనుమంతుడిని ఆరాధించడం వల్ల కుజదోష నివారణ కలుగుతుంది ఏడుసార్లు హనుమాన్ చాలీసా పటిస్తూ ఆంజనేయుడికి ఎర్రటి పుష్పాలతో పూజించడం శుభప్రదం. అమావాస్య రోజున రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని భావిస్తారు అందుకే అమావాస్య రోజు రావి చెట్టు మొదలులో పాలు పోసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి రాగి చెట్టు చుట్టూ7 లేదా11 ప్రదక్షిణలు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకునేవారు, ఇతర ప్రయాణాలను చేయకపోవడం మంచిది ఇక అమావాస్య రోజు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.