Bathukamma Song : తాజాగా విడుదలైన మన తెలంగాణ పాటలో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సందడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన హీరోగా హిందీలో “కిసీ కా భాయ్ కిసీ కా జాన్” అనే మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, సీనియర్ నటి భూమికా చావ్లా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇన్నాళ్ళు ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా విడుదల చేసిన తెలంగాణ పాటతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పష్ఠం చేశారు. ఇక ఈ పాటను పూర్తిగా తెలంగాణ సాంప్రదాయాన్ని ఆవిష్కరిస్తూ చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ పాటలో సల్మాన్ ఖాన్ మన ట్రెడీషనల్ వేర్ లో కనిపించడం బావుంది. పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పేదుముంది.
ఆయన గెటప్ చూస్తే సంక్రాంతి లాంటి ఫ్యామిలీ మూవీ గుర్తొస్తుంది. సల్మాన్ ఖాన్ గత కొంతకాలోంగా మన తెలుగు చిత్రాల్లో కనిపించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీకి ఇటు దగ్గుబాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే కండల వీరుడు ఇప్పుడు నేరుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక సాంగ్ పిక్చరైజేషన్ అంతా కూడా కంప్లీట్ ట్రెడీషనల్‌గా ఉంది.
బాలీవుడ్‌లో ఫ్యామిలీ మూవీస్‌లో కల్చర్‌ను అద్భుతంగా చూపిస్తారు. ఇప్పుడు మన తెలుగు వారు అందులోనూ తెలంగాణ సంసృతిని బాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ సాంగ్ రిలీజైన కొద్దిసేపట్లోనే ఊహించని లైక్స్ షేర్ రాబట్టింది. యూట్యూబ్‌లో ఇప్పుడు ఈ బతుకమ్మ పాటే ట్రెండింగ్‌లో ఉంది. చూడాలి మరి ఈ సాంగ్ ఎలాంటి సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జగపతిబాబు మరో ముఖ్య పాత్రలో సందడి చేయతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.