Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన “మిస్టర్ బచ్చన్” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లొ పరిచయమైంది భాగ్యశ్రీ బోర్సే. సినిమా ఫలితం ఎలా ఉన్నా లుక్స్ పరంగా అటు ఇండస్ట్రీ వర్గాలను ఇటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునుంది. దాంతో సౌత్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
భాగ్యశ్రీది మరాఠి బ్యాగ్‌గ్రౌండ్. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో పుట్టి పెరిగింది. సిల్క్ చాక్లెట్ యాడ్ తో బాగా పాపులర్ అయింది. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2023లో రూపొందిన హిందీ సినిమా ‘యారియా 2’ లో ఒక గెస్ట్ రోల్ చేసింది. ఈ సినిమా తర్వాత ‘చందూ చాంపియన్’ బాలీవుడ్ లో బాగానే గుర్తింపు తెచ్చింది. ఈ క్రమంలోనే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో ఛాన్స్ అందుకొని తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
Bhagyashri Borse: మమతా మోహన్‌దాస్ పోలికలున్నాయని..
ప్రస్తుతం భాగ్యశ్రీ, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ‘కాంత’ అనే సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తుంది. ఇందులో టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుపాటి కీలక పాత్రను పోషిస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో భారీ బడ్డెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అయితే, కొందరు నెటిజన్స్ భాగ్యశీ బ్యాగ్‌రౌండ్ ఎంటీ..? అని గూగూల్ సర్చ్ చేస్తున్నారు. సినిమా నేపథ్యం కాకపోయినప్పటికీ గతంలో ఇటు తెలుగులో అటు తమిళంలో సింగర్ గా హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మమతా మోహన్‌దాస్ పోలికలున్నాయని చెప్పుకుంటున్నారు. కొన్ని ఫ్రేంస్ లో ఇద్దరూ ఒకేలా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. హైట్ అండ్ పర్సనాలిటీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ భాగ్యశ్రీ అప్పటి హీరోయిన్ మమతా మోహన్‌దాస్ ని పోలి ఉందని అంటున్నారు.
మమతా మోహన్‌దాస్ తెలుగు ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం అయింది. అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించింది. అలాగే.. ‘హోమం’, ‘భాయ్’, ‘కేడీ’ చిత్రాలలో కూడా నటించింది. ఇక ఎక్కువగా దేవీశ్రీ ప్రసాద్, ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన పాటలను పాడి పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకుంది. ‘శంకర్ దాదా జిందాబాద్’ లో ఆకలేస్తే అన్నం పెడతా, ‘జగడం’ సినిమాలో 36-24-36 అనే పాట, ‘యమదొంగ’ లో ఓలమ్మి తిక్కరేగిందా, ‘తులసి’ సినిమాలో ‘మియా మియా’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ మమతా పాడినవే. ఇప్పుడు ఈ బ్యూటీ మాదిరిగానే భాగ్యశ్రీ కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేసి చూడవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.