Bhagavanth Kesari : టాలీవుడ్ స్టార్.. మాస్ హీరో బాలకృష్ణ ఊర మాస్ లుక్‌తో అదరగొడుతున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న తన మూవీ భగవత్ కేసరిలో పవర్ ఫుల్ డైలాగులతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కించబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గణేష్ పాట ఓ రేంజ్లో అదరగొట్టింది. ఈ సాంగ్ లో బాలయ్య, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులతో అందరినీ అమితంగా ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్ ఇవాళ విడుదల అయింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. బాలయ్య అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వవస్తున్న భగవత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించాడు. బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ ఈ మూవీకి మంచి ఇంగ్లీష్ క్యాప్షన్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ క్రేజీ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ క్రమంలో లేటెస్టుగా విడుదలైన ట్రైలర్ లో బాలయ్యను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా డైరెక్టర్ అనిల్ చూపించాడు. ఈ ఇద్దరి ఇమేజ్ లకు భిన్నంగా కథ, కథనాలను ఉండబోతున్నాయి. దీంతో భగవంత్ కేసరి పై అంచనాలు భారీగా పెరిగాయి. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ స్లాంగ్ లో మొదటిసారిగా బాలకృష్ణ డైలాగులు చెప్పి అదరగొట్టాడు. ఈ ట్రైలర్ తో దసరా రేసులో ఉన్న సినిమాలకు బాలయ్య ఓ రేంజ్ లో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ సి రాం ప్రసాద్ అందించగా తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు. ట్రైలర్‌తో బాలయ్య తన గ్రేస్ ను చూపించాడు. ట్రైలర్ చూసినంత సేపు అందరూ బాలయ్య ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఎవడు బలవంతుడో వాడే గెలుస్తడు అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ ట్రైలర్ కి తమన్ బీజీఎం తోడవడంతో ఇరగదీస్తోంది. శ్రీలీల ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోల్చితే భవత్ కేసరిలో తన పర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించబోతోంది. ఇక కాస్త గ్యాప్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్ అగర్వాల్ ఈ మూవీలో ఓ రేంజ్ గ్లామర్ షో చేస్తున్నట్లు తెలుస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.