Mahaa Shiva Raatri: మరో రెండు రోజుల్లో మహా శివరాత్రి పర్వదినం రాబోతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం గురించి మహర్షులు, పండితులు చెబుతూ ఉంటారు. ఇక ఈ రోజున దేశ వ్యాప్తంగా ఉన్న శైవ ఆలయాలు అన్ని కూడా భక్తులతో కిక్కిరిసి పోతాయి. కోట్లాది మంది భక్తులు శివాలయాలకి వెళ్లి ఆ ముక్కంటిని పూజిస్తారు. అదే సమయంలో ఆ రోజు ఉపవాసాలు ఉంటారు. అలాగే రాత్రి జాగరణ చేసి ఉదయాన్నే సంధ్యాస్నానం చేసి మరల శివాలయానికి వెళ్లి ముక్కంటిని ఆరాధిస్తారు. ఇలా చేయడం వలన జీవితంలో చేసిన సకల పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం.
హేతువాదులు దీనిని మూఢ నమ్మకంగా కొట్టిపారేసిన మన ఆద్యాత్మిక ప్రపంచంలో ఆచరించే ప్రతి ప్రక్రియ వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే మహాశివరాత్రి రోజున శివయ్యని భక్తితో ఆరాధిస్తారు. ఇదిలా ఉంటే మహాశివరాత్రి రోజున శివయ్యని ఆరాధించడంలో ఎంత నిష్టతో ప్రజలు ఉంటారో కొన్ని చేయకూడని పనులు విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఆహారాలకు దూరంగా ఉండటం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే మాంసంహారానికి అస్సలు ముట్టుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా ఆ రోజు వండుకునే పదార్ధాలలో ఉండకుండా చూసుకోవాలి. అలాగే మాదకద్రవ్యాలకి, మత్తుని కలిగించే పొగాకు, మధ్యాన్ని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు. ఈ నియమాలని తప్పడం అంటే మహాశివుడికి అపచారం చేసినట్లే అని పండితులు చెప్పే మాట. అలాగే శివయ్యకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయకూడదు. కేతకి పువ్వులని కూడా సమర్పించకూడదు.
నలుపు రంగు దుస్తులకి దూరంగా ఉండాలి. తులసి ఆకులని శివయ్యకి దండగా వేయకూడదు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో శివరాత్రి పర్వదినం రోజున నిద్ర లేచి స్నానం ఆచరించి మహాశివుడి ఆలయానికి వెళ్లి ముక్కంటిని దర్శించుకుంటే మంచిది. అలాగే ఉపవాస, జాగరణ చేసే వారు ముందుగానే తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూసుకొని వాటిని పాటించాలి. లేదంటే శారీరకంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.