Categories: HealthLatestNews

Health – Neem Leaves: వేప చిగురు, వేప ఆకుతో ఉన్న ఉపయోగాలెన్నో..తెలిస్తే అసలు వదలరు..

Health – Neem Leaves: మారిన కాలానుగుణంగా ఎక్కువశాతం ప్రజలు రక రకాల టూత్ పేస్ట్, పౌడర్‌లను ఉదయం లేవగానే పళ్ళు తోమడానికి ఉపయోగిస్తు న్నారు. కానీ, పూర్వ కాలంలో వేప కొమ్మల నుంచి చిన్న చిన్న పుల్లలను విరిచి ఆ పుల్లలతో పళ్ళు తోముకునేవారు. పల్లెటూర్లలో ఇప్పటికీ ముఖం కడుక్కోవడాని కి వేప పుల్లలనే ఉపయోగిస్తున్నారు. వేప పుల్లతో పళ్ళు తోమడం వల్ల నోట్లో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా నశించిపోతుంది. అంతేకాదు, కొందరు పుచ్చి పళ్ళతో బాధ పడుతుంటారు. అలాంటి వారు వేప పుల్లతో పళ్ళు తోముకుంటే ఆ నొప్పి నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. వేపలోని చేదుతనం శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.

benefits of using neem-leaves

ఇక అమ్మవారు పోసిన వారికి వేప ఆకు చిగురును, లేత ఆకులను తీసుకొని పసుపు నువ్వుల నూనె కలిసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకొని ఒళ్లంతా పట్టించి కాసేపు అయ్యాక స్నానం చేస్తే శరీరానికి హాయిగా ఉంటుంది. ఒంటిమీద ఉన్న క్రిములు, బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాదు వేప ఆకులను నీళ్ళలో వేసి బాగా మరిగిన తర్వాత ఆకులను తీసేసి ఆ నీటితో తల స్నానం చేయడం చాలా మంచిది. వేప ఆకులోని ఔషధ గుణాలు శరీరంపై ఉన్న మలినాలను పూర్తిగా తొలగిస్తాయి.

Health – Neem Leaves: చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చును.

ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలకు వేపాకు వేసి మరగబెట్టిన నీటితో స్నానం చేయిస్తారు. దీని వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అలాగే, చర్మ వ్యాదులను, బ్యాక్టీరియా వల్ల ఒంటిపై వచ్చే దురదలను, దద్దుర్లను వేపాకుతో పసుపు మిశ్రమాన్ని ఒళ్ళంతా రాసుకుని స్నానం చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక అమ్మాయిలలో కొందరికి చుండ్రు సమస్య ఉంటుంది. అలాంటి వారు కొద్దిగా వేపాకులను తీసుకొని మెత్తగా రుబ్బుకొని దానికి రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తల వెంట్రుకలకు బాగా పట్టించాలి. పది, పదిహేను నిముషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చును.

అలాగే, లేత వేప ఆకులను మెత్తగా రుబ్బి..చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మిగతా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, తగ్గుతుంది. బీపీ, షుగర్ సమస్యలున్న వారు రోజూ ఉదయం గనక ఈ వేప ఆకులతో చేసిన ఉండలను తింటే బీపీ, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాదు, హార్ట్ ఎటాక్ రాకుండా కూడా వేపాకు కాపాడుతుంది. వేప ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని పొడిగా ఉన్న డబ్బాలో భద్రపరుచుకొని రోజూ నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల కూడా చాలా రోగాల నుంచి కాపాడుకోవచ్చు.

గమనిక: పైన చెప్పిన విషయాన్నీ ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు తెలపబడినవి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

22 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

22 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.