Health and Life Insurence: ఒకప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటూ ఇంటి చుట్టూ ఏజెంట్లు తిరిగేవారు. ఫోన్ చేసి పదే పదే విసిగించే వారు. మీరు పోతే మీ కుటుంబ పరిస్థితి ఏంటి అంటూ ఆలోచనలో పడేసేవారు. క్లాసులు పీకే వారు. కానీ కాలం మారింది కరోన ఉగ్రరూపం దాల్చింది . దీంతో మధ్యతరగతి నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలే ఇన్సూరెన్స్ తీసుకుంటామంటూ ఇన్సూరెన్స్ ఆఫీస్ ల చుట్టూ క్యూలు కడుతున్నారు. ఒకటి కాదు అంతకు మించి పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
కరోన పుణ్యమా ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించి పోయింది. ఆర్థిక వ్యవస్థ కుంటు పడిపోయింది. డబ్బులు సంగతి దేవుడెరుగు ప్రాణాలైనా మిగిలితే చాలు అనే పరిస్థితికి మనిషి చేరుకున్నాడు. చాలా మంది కరోనా బారినపడి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందక, ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందేందుకు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలను నిలబెట్టుకునేందుకు లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేశారు. ఆస్తులు పోతే ఏముంది ఆయువు మిగిలి ఉంటే చాలు అని అనుకుని ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. ఊరుకు ఒక్క సమస్య ఇలాగే ఉండింది.
డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడల్లా అరెరే ఇన్సూరెన్స్ చేయించుకుంటే పోయనే అని చాలామంది మదన పడిపోయారు. అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ ని మార్చుకుని ఇన్సూరెన్సు చేయించుకునే బాటపట్టారు. కరోనతో హాస్పిటల్లో కాలు పెడితే లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేసిన సంఘటనలను గుర్తుచేసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆ ఖర్చులను తప్పించుకునేందుకు పాలసీ తీసుకోవాలన్న నిర్ణయానికి వస్తున్నారు ప్రజలు. ప్రజల అవసరాల నిమిత్తం వివిధ రకాల ఇన్సూరెన్స్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఈ మధ్య కాలంలో వ్యాధులు లేని, రోగి లేని ఇల్లు లేదు. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్యంతో బాధ పడుతూనే ఉన్నారు. చాలా మంది చిన్నగా ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేసి దాన్ని పీకల మీద వరకు తీసుకు వస్తున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకొస్తున్నారు. దీంతో ఖర్చులు తడిసి మోపెడవు తున్నాయ్. అంతగా డబ్బు చెల్లిస్తే పర్లేదు కానీ చెల్లించిన వారి పరిస్థితి ఏమిటి. అందుకే ముఖ్యంగా ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ లు చేసుకునేందుకు ఆసక్తి చూపు తున్నారు. కుటుంబ సమేతంగా చిన్నాపెద్ద అందరికీ వర్తించేలాగా దీర్ఘకాలం అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నుకుంటున్నారు.
ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఎలాంటి టెన్షన్ లేకుండా వైద్య సేవలు పొందేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పన్ను నుంచి కాలి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దానికి తగిన పాలసీలు అందుబాటులో ఉన్నాయి . లక్ష రూపాయల పాలసీ నుంచి కోటి రూపాయల వరకు అనేక హెల్త్ ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. కరోన కోసం కూడా ప్రత్యేకమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2021 నుంచి ఈ పాలసీ ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కరోనా వైరస్ రావడంతో ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉంటామో అర్థం కాక ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య భద్రత కోసం ఇన్సూరెన్సు పాలసీలను చేయిస్తున్నారు.
ఇక కరోన కారణముగా చాలా మంది ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కరోన కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడిన మరోసారి మరో రూపంలో మరో ప్రమాదం ముంచు కొస్తుందో అన్న భయంతో లైఫ్ ఇన్సూరెన్సు పాలసీలను చేయించుకుంటు న్నారు. తాము పోయిన తర్వాత తమ కుటుంబం ఆర్థికంగా గట్టిగా ఉండాలన్న నిర్ణయంతో ఈ పాలసీలను చేయించుకుంటున్నారు. మగవారి కాదు అన్ని వయసుల వారికి ప్రత్యేకమైన పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి మాత్రమే పాలసీలను అందించేది.
కానీ నేడు అనేక ప్రైవేటు కంపెనీలు కోటాను కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ లను అందజేస్తోంది. ఈ రోజు 30 రూపాయల పొదుగుతూ సుదీర్ఘ కాలంలో నాలుగు లక్షలు పొందే ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పిల్లల చదువుల కోసం కూడా ప్రత్యేక మైన పాలసీలు ఉన్నాయి. నెలకు వెయ్యి రూపాయలు కడితే వారి చదువుకు అవసరమైన డబ్బులు వచ్చేలాగా ఈ పాలసీలను డిజైన్ చేశారు. ఒంటరి మహిళ తో పాటు గృహిణులకు కూడా ప్రత్యేక మైన పాలసీలు ఉన్నాయ్. కాస్త వయసు పై బడిన వారికి కూడా ఏదో రకంగా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పాలసీలు కూడా ఉన్నాయి. మొత్తాని కి గత ఏడాది నుంచి ఈ పాలసీ ల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. మీరు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఒక పాలసీకి అప్లై చేసి మీ జీవితాన్ని సెక్యూర్ చేసుకోండి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.