Categories: Tips

Mutual Funds: సరైన అవగాహాన ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందే ప్రయోజనాలు ఎన్నో….

Mutual Funds: డబ్బు సంపాదించే వాడు కాదు దాన్ని తెలివిగా దాచుకునే వాడే అసలైన విజ్ఞాని. ఈ కాలంలో చాలా మంది లక్షల కొద్దీ డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఇందులో పెట్టుబడులు పెట్టాలో సరైన అవగాహన లేక దీర్ఘకాలంలో వారు సంపాదించిన డబ్బులు ఆస్వాదించ లేక పోతున్నారు. ఈ క్రమంలో చాలా రకాల సేవింగ్ పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులో అయితే ఫిక్స్డ్ డిపాజిట్లనీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, బంగారం కొనుగోలు చేయడం, ఇన్సూరెన్స్ చేయడం, రియల్ ఎస్టేట్, భూములు కొనుగోలు చేయడం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ వంటి చాలా రకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి.

అయితే ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ అంటే మాత్రం కాస్త రిస్కుతో కూడుకున్న అని వెనుకంజ వేస్తున్నారు. నిజానికి ఈ రంగంలో కాస్త రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంతరిక్షంలో పోతున్న రాకెట్ వెలాసిటీ తెలుసుకునేం దుకు రాకెట్ సైన్స్ ఏవిధంగా తెలుసుకో వాలో అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు కూడా అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకో వాల్సిన అవసరం ఉంది. ఇది పెద్దగా భయపడాల్సింది కాదు. రాకెట్ సైన్స్ కూడా కాదు. చిన్న లాజిక్ తో అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు.

benefits of having mutual funds

చిన్నతనంలో ఒకప్పుడు ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి మీ దగ్గర సరిపడినంత డబ్బులు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని జత చేసుకుని చాక్లెట్ కొనుక్కునేవారు. అదే విధంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కాస్త రిస్కుతో కూడుకున్నది అయినప్పటికీ, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడులు పెడతారు కాబట్టి పెద్దగా భయపడాల్సింది ఏమీ ఉండదు. మ్యూచువల్ ఫండ్ అనేది సామాన్య మానవుడికి అత్యంత విలువైన పెట్టుబడి అని అంటారు నిపుణులు.

నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ మ్యూచువల్ ఫండ్స్ లో మీ ప్రొఫెషనల్స్ ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. మీరు నిద్ర పోతున్నా వారు గమనిస్తూనే ఉంటారు. మోనిటర్ చేయడంతో పాటు అడ్జస్ట్మెంట్స్ కూడా చేస్తారు. అది ఎలా అంటే ఒక తల్లి తన పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లను ప్రొఫెషనల్ అంతే జాగ్రత్త గా గమనిస్తూ ఉంటారు. మీ డబ్బు ఒక వైవిధ్యమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడిగా ఉంటుంది. తక్కువలో తక్కువగా 500 రూపాయలు పెట్టుబడి పెట్టినా సరే. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కోసం మీరు మార్కెట్ల పైన పెద్దగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ పని నిష్ణాతులు చేస్తారు. ఇందులో అమ్మడం కొనడం అనేవి చాలా సులభతరంగా ఉంటాయి.

ముందుగా పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు ఎందులో పెట్టుబడి పెట్టాలో ముందు గా నిర్ణయించుకోవాలి. దీర్ఘకాలంగా పెట్టుబడిని కొనసాగించే వారికి స్వల్ప కాలిక వారికి చాలా రకాల ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ లో చాలా రకాల స్కీమ్ లు ఉన్నాయి ఒక్కొక్కరికి వర్తిస్తూ ఉంటుంది. డేట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఐటి ఫండ్స్ అని చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ మదు పరులకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే అందులో మీరు పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఐటిలో బాగుంటే ఐటిలో పెట్టుకోవచ్చు లేదా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు గోల్డ్ ఫండ్స్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కాస్త రిస్కుతో కూడుకున్నది అయినప్పటికీ దీర్ఘ కాలంలో ద్రవ్యోల్బణం కన్నా అధిక ఆదాయాన్ని ఇందులో పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక మరికొంత మంది ఒకేసారి పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు లేదా షేర్స్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతుంటారు కానీ అందుకు తగ్గట్లుగా వారి దగ్గర డబ్బులు అందుబాటులో ఉండక పోవడం వల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన నిర్మించుకుంటారు. ఇలాంటి వారికి పెర్ఫెక్ట్ వేగా మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తోంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పెద్ద వాల్యూమ్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఒక్కరి పెట్టుబడి పెట్టడం కాకుండా నలుగురైదుగురు అమౌంట్ ని కలుపుకొని ఒక కంపెనీ లో పెట్టుబడులు పెడతారు. ఇలా చేయడం వల్ల దీర్ఘ కాలంలో వారు తక్కువ అమౌంట్ పెట్టినప్పటికీ లాభదాయకమైన ఆదాయం పొందుతారు.

ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన చాలామంది కూడా నిష్ణాతుల సలహాల మేరకు మంచి ఆదాయం పొందుతున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఒక వ్యక్తి 500 రూపాయలతో ఒక కంపెనీలో పెట్టుబడి అదే నుండి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. తమకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఈ అమౌంట్ ని కాస్త పెంచుకోవాలి అనుకున్న పెంచుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు లేవు. అయిదు వందల నుంచి లక్ష రూపాయలు అంతకు మించి కూడా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలా చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ తో పాటు త్వరగా తమ ఆర్థిక గోల్ ను చేరుకోవచ్చు.

ఇప్పుడు చాలా వరకు అందుబాటులో ఉన్న కొన్ని పొదుపు పద్ధతులు ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మెచ్యూరిటీ టైం వరకు తీసుకోలేం. ఇన్సూరెన్స్ లు అదే విధంగా ఉంటాయి అలాగే బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న డబ్బులు కూడా అదే పద్ధతిలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. భూముల పై పెట్టుబడి పెట్టినా అది అమ్మకం జరిగే వరకు వేచి ఉండాల్సిందే దానికి మంచి రేటు పలికే వరకు అలా ఉంచు కోవాల్సిందే. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులను తీసుకోవచ్చు. దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన పని కూడా ఉండదు. కొన్ని పాలసి ప్లాన్ ప్రకారం విత్ డ్రా చేసుకోవచ్చు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేస్తారో అందులో మీ డబ్బు వచ్చి చేరుతుంది.

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.