Health: మనలో చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే బెండకాయలను కోస్తే జిగురుగా ఉంటుంది. ఈ బెండకాయలను రక రకాలుగా వండుకుంటారు. బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు, బెండకాయ పచ్చడి. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకమైన రుచికరంగా వండుకుంటుంటారు. అయితే, చాలా మందిలో బెండకాయలో ఉండే జిగురు ఎమవుతుందీ అని. ఆ జిగురు మనం తిన్న తర్వాత శరీరంలో ఏ ఏ భాగాలలోకి చేరుతుందీ అనే సందేహాలు కలుగుతాయి. అలాంటి వారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.
మనం బెండకాయ తీసుకుంటే దాని జిగురు ఎముకలలోకి వెళుతుందని భావిస్తారు. కానీ, అది కేవలం అపోహ మాత్రమే. మనం బెండకాయను ఏ రకంగా కూర చేసుకొని తిన్నా పొట్టలోకి మాత్రమే వెళుతుంది. నిజంగా మనం కాకరకాయ తింటే మన రక్తం చేదుగా, స్వీట్ తింటే తియ్యగా, బిర్యానీ తింటే ఆ వాసన వస్తుందనుకుం టే అది కొందరు పడే అపోహ మాత్రమే. అందుకే, బెండకాయ తింటే ఎముకల్లో జిగురు చేరదు అని తెలుసుకోవాలి. మన ఏ ఆహారం తీసుకున్నా కూడా, ఏ పదార్థం తిన్నా అది ముందు చేరుకునేది మన పొట్టలోకే. మన తిన్న ఆహారం అరగడానికి హైడ్రో క్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇది ఘాటైన యాసిడ్. అలాగే, రక రకాల జీర్ణ రసాలు తయారవుతాయి. అంతేకాదు పలు రకాల ఎంజైములు కూడా పొట్టలోకి వస్తాయి.
ఇవన్నీ కలిసేసరికి మనం తిన్న బెండకాయలో ఉన్న జిగురు ఆ యాసిడ్ ఘాటుకు మొత్తం నశిస్తుంది. ఆ తర్వాత బెండకాయ చక్కెరగా మారుతుంది. ఇది రక్తంలోకి చేరుతుంది. అంతేగానీ, బెండకాయలోని జిగురు మాత్రం వెళ్ళదు. అయితే, బెండకాయలోని జిగురు కొంత ప్రేగుల్లో ఉంటుంది. ఇది రక్తంలోకి వెళ్ళదు, అలాగే, ఎముకల్లోకి, జాయింట్స్‌లోకి వెళ్ళదు. ఒకవేళ ఎముకల్లో జిగురు రావాలంటే.. ఉప్పులేని ఆహారాలు తీసుకోవాలి. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. దీనివల్ల ఎముకలలో జిగురు వస్తుంది.
అంతేగానీ, కేవలం బెండకాయ తింటేనే జిగురు వస్తుంది ఎముకల్లో అంటే, క్రమం తప్పకుండా తినొచ్చుకదా.. జీవితకాలంపాటు బెండకాయనే ఆహారంలో తీసుకోవచ్చు కదా. అంటే వైద్య నిపుణులు చేప్పేదాన్ని బట్టి ఇది కేవలం కొందరిలో ఉన్న అపోహలే. ఇక మరికొందరిలో బెండకాయ తింటే జ్ఞాపక శక్తి బాగా వస్తుంది అంటుంటారు. ఇది నిజమేనా చూద్దాం.
మనలో చాలామంది, మరీ ముఖ్యంగా అతి త్వరగా మర్చిపోయే లక్షణం ఉన్నవారికి బెండకాయ ఎక్కువగా పెట్టండి వీరికి జ్ఞాపక శక్తి బాగా వస్తుందని అంటుంటారు. బెండకాయ ప్రభావం మెదడుపై ఎక్కువగా చూపుతుందీ అని చెబుతుంటారు. మరి ఇది కూడా మూఢనమ్మకం, అపోహా అని భావిస్తే పొరపాటే. ఈ విషయం ముమ్మాటికీ నిజం. బెండకాయలో జ్ఞాపక శక్తి, తెలివి తేటలకు, మేధాశక్తికి బెండకాయ ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల నిజంగానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనికి కారణం బెండకాయలో పాలిఫినాల్స్ ఉంటాయి. అంతేకాదు, బెండకాయలో యాంటీ ఆక్సిరెంట్స్ ఉంటాయి.
ఇవి మెదడు కణజాలు జబ్బులబారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని యాంటి ఆక్సిడెంట్స్ అంటారు. బ్రేయిన్ సెల్స్‌కు ఇవి బాగా రక్షణ కలిగిస్తుంటాయి. అందుకే బెండకాయలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెమరీని పెంచటానికి పిల్లలు తెలివిగా ఆలోచించడానికి, వేగంగా మెదడు పని చేయడానికి ఎక్కువగా బెండకాయ తినిపించమని సూచిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థుల్లో తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించే శక్తి బెండకాయకు ఉంటుంది. అందుకే, ఈ బెండకాయ ఎక్కువగా పెట్టమని సలహా ఇస్తుంటారు. ఇది సైంటిఫికల్‌గా కూడా నిర్ధారణ అయింది. 2017లో యూనివర్సిటీ ఆఫ్ ఇలాస్.. స్పేయిన్ దేశస్థులు బెండకాయపై పరిశోధన చేసి బెండకాయకు, మెదడుకు సంబంధం ఉందని కనుగొన్నారు. కాబట్టి బెండకాయ తింటే దానిలో ఉండే జిగురు ఎముకల్లోకి వెళుతుందని అపోహ అని, అలాగే ఇది పిల్లలలో జ్ఞాపక శక్తిని బాగా అభివృద్ధి చేస్తుందనేది సత్యమని తెలుసుకోండి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.