Health: ప్రతి ఇంట్లో బెల్లం కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడంటే తీపి కోసం పంచదార ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ పూర్వం అన్ని తీపి పదార్ధాలలో బెల్లం మాత్రమే ఉపయోగించేవారు. బెల్లంతో చేసే పిండి వంటలనే ఎక్కువగా తినేవారు. ఓ విధంగా తీపి పదార్ధాలు అంటే బెల్లం లేకుండా చేసేవారు కాదు. పంచదార అనేది చాలా తక్కువ. మారుతున్న కాలంతో పాటు ప్రజల అవసరాలలో పంచదారకి ప్రాముఖ్యత పెరిగింది. దానికి కారణం ధర తక్కువ ఉండటం, సులభంగా ఉపయోగించడానికి అనువుగా ఉండటంతో దీనిని వాడుతున్నారు.
అయితే పంచదార ఎక్కువగా తినే వారిలో షుగర్ చాలా వేగంగా వస్తుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. షుగర్ వచ్చిన తర్వాత పూర్తిగా తీపి పదార్ధాలకి దూరం కావాలి. అయితే బెల్లాన్ని ఉపయోగించే రోజులలో ప్రజల్లో షుగర్ వ్యాధి అంటేనే తెలియదు. ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన వారిలో షుగర్ వ్యాధి అనేది సాధారణం అయిపొయింది. ఇదిలా ఉంటే తీపి పదార్ధాలలో బెల్లం ఉపయోగించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. సహజసిద్ధంగా చెరుకు నుంచి తయారయ్యే ఈ బెల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే చిన్న బెల్లం ముక్క తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతలని బెల్లం చాలా అద్భుతంగా నియంత్రిస్తుందని అంటున్నారు. ఉదయాన్నే పరగడుపున బెల్లం తింటే ఎసిడిటీ, కడుపుమంట దూరం అవుతుంది.అలాగే బెల్లంలో కాల్షియం పదార్ధాలు ఎక్కువగా ఉండటం వలన ఎముకల దృఢత్వం పెరుగుతుంది. అలాగే నరాల సమస్య, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. దాంతో పాటు ఐరన్, మినరల్స్ ఇందులో అధిక మోతాదులో ఉండటం వలన శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే బెల్లంలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు, నాడీ వ్యవస్థని సరళతరం చేస్తుంది. మైగ్రేయిన్ సమస్యలు ఉన్నవారు బెల్లం, నెయ్యి కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా బెల్లంలో ఎన్నో రకాల సమస్యలని దూరం చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీనిని పిండివంటలలో ఉపయోగించేవారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.