Curd: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము. ఇలా పెరుగును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయనే విషయం మనకు తెలిసిందే. అదే విధంగా మనం తీసుకున్న ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజన సమయంలో తప్పనిసరిగా పెరుగు ఉండేలా చూసుకుంటూ ఉంటాము. అయితే వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. అలాగే వర్షాలు కూడా అధికంగా పడుతున్న తరుణంలో పెరుగును తినటం వల్ల జలుబు చేస్తుందని చాలామంది పెరుగును తినకుండా ఉంటారు.
ఇలా వర్షాకాలంలో చలువ చేస్తుందన్న ఉద్దేశంతో పెరుగును కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది .
ఇక ఈ వర్షాకాలంలో పెరుగు తింటే డయోరియా వంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. అంతే కాదండోయ్ ఊబకాయంతో, అధిక బరువుతో బాధపడేవారికి పెరుగు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక గుండె సమస్యలు కూడా మన దరి చేరవు. ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తాయి. అందుకే వర్షాకాలంలో తప్పనిసరిగా పెరుగు తీసుకోవడం ఎంతో ముఖ్యం అయితే ఎవరైతే ఆస్తమా వంటిసమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం తినడం మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.