Women: ఒకప్పుడు నెలసరి వల్ల నెలలో ఐదు రోజులన్నా మహిళలకు విశ్రాంతి దక్కేది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. నెలసరి వచ్చినా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు చేసి ఉద్యోగాలకు వెళుతున్న మహిళలు చాలా మందే ఉన్నారు. ప్రతి నెల ఓ ఐదు రోజులు మహిళలు అనుభవించే మానసిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ ఐదు రోజులను దినదినగండంగా గడుపుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తడిలు, మానసిక ఒత్తిడిల కారణం గా నెలసరిలోనూ అనేక మార్పులు వచ్చాయి.
ఈ మధ్యకాలంలో ప్రతి నెల నెలసరి రాక చాలా మంది సమస్యలు ఎదుర్కొంటు న్నారు. కొంత మంది నెలలో 15 రోజులకు ఒకసారి రక్తస్రావం జరిగి నానాతంటాలు పడుతున్నారు. క్రమం తప్పకుండా రుతు క్రియలు జరిగిపోతుండాలి అప్పుడే మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ కొంత మంది పూజలు ఉన్నాయని, పెళ్లిళ్లు ఉన్నాయని, వ్రతాలు చేసుకోవాలని, ప్రయాణాలు చేయాలని ఇలా కారణాలు ఏమైనా మెడికల్ షాపుల్లో లభించే మందులను వాడి సజావుగా సాగే నెలసరికి బ్రేక్ వేస్తున్నారు. అందులో తప్పేముంది అవసరం బట్టి వాడతాం అని కొట్టిపడేసే మహిళలు ఉన్నారు. కానీ ఇలా ఇష్టారీతిన మాత్రలు వాడటం వల్ల మహిళలకు తెలియకుండానే అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
నెలసరి రాకుండా వేసుకునే మాత్రలను వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల మహిళలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ప్రధానంగా కాలేయ సమస్యలు, సిక్‌నెస్, ఇరిటేషన్, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు వేధిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాదు కొంత మందిలో అధిక రక్తస్రావం సమస్యలు కూడా ఉత్పన్నమవుతా యి. నిజానికి ఏ వైద్యుడు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవాలని సూచించరు. వీటిని అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. కానీ మహిళలు తమ వ్యక్తిగత అవసరాల కోసం వీటిని విపరీతంగా వాడుతున్నారు. కానీ అక్కడే అసలు మోసం మొదలవుతుంది.
ప్రతి నెల ఓ సమయానికి మహిళలకు పీరియడ్స్ వస్తాయి. 25 నుంచి 35 రోజుల కు ఒకసారి పీరియడ్స్ వచ్చాయంటే దానిని రెగ్యులర్ సైకిల్ అంటారు. ఇలా కాకుండా కొంత మందికి పదిహేను రోజులకు రావడం , రెండు మూడు నెలల వరకు రాకపోవడం, మరికొంత మందికి 6 నెలల వరకు పీరియడ్స్ రాకపోడం అంటే వీరిలో ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నట్లు. వీటి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది పీసీఓడి కండీషన్. పీసీఓడీ ఉండటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. అండాశయంలో గుడ్ల సంఖ్య తగ్గినప్పుడు కూడా సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి. ఇలా జరిగితే తప్పనిసరిగా మీరు డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రెండు కాకుండా మూడో సమస్య వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావచ్చు హర్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. పనిలో ఒత్తిడి ఉండటం, మూడ్ స్వింగ్స్, విపరీతమైన తలనొప్పి రావడం, రాత్రిళ్లు చెమట పట్టడం, ఆకలి వేయడం స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా పీరియడ్స్ రెగ్యులారిటీ మిస్ అవుతుంది.
ఆడవారు ఆరోగ్యంగా లేకపోతే ప్రపంచమో నాశనం అవుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఆడవారు ఆరోగ్యానికి మూలం. కానీ వారే ఇప్పుడు అనేక అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో మొదలవుతు న్నాయి. ఆహార పదార్ధాల్లో మార్పులు రావడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాఫీలు, టీలు, పాలు విపరీతంగా తాగడం వల్ల మహిళల్లో హార్మోనల్ ఇంబాల్స్ ఏర్పడింది. పాల వాడకం వల్ల రుతుచక్రంలో అనేక సమస్యలు వస్తున్నాయి. అంతే కాదు 14 ఏళ్లకు వయస్సుకు రావాల్సిన పిల్లలు ఇంకా ముందే పెద్దవారు అవుతున్నారు. అందుకే మహిళలు హార్మోనల్ బాలెన్స్ చేసుకోవాలి. కాపీలు, టీలు, పాలు మానేస్తే సగానికి సగం సమస్యలు తీరుతాయంటున్నారు.
తీసుకోవాల్సిన ఆహారం గురించి ఓసారి మాట్లాడదం. సాధారణంగా ప్రతి మహిళ ముందుగా తమ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. ఇంట్లో ఉన్నవారికి కడుపు నిండా వండిపెడుతుంది. కానీ తన గురించి ఏమాత్రం ఆలోచించదు. ఏం తింటాంలే తరువాత చూసుకుందాం అని కొట్టిపారేస్తుంది. ఇంట్లో ఫుడ్ లేనప్పుడు ఇక వండుకోవాలా అన్న బద్ధకంతో తినకుండానే పడుకుంటుంది. సమయానికి శరీరానికి అందాల్సిన పోషకాలను అందించడంలోనూ మహిళలు చివరి వరుసలో ఉంటారు. తమని గురించి తాము అసలు పట్టించుకోరు. అసలే రసాయనాలతో పండుతున్న ఆహారాన్ని తీసుకుంటున్నాము.
ఆ ఆహారం కూడా సరిగా తినకపోతే ఒంట్లో సత్తువ ఎక్కడి నుంచి వస్తుంది. అంతే కాదు చాలా మంది మహిళల లో పోషకాల లేమితో బాధపడుతున్నారు. పది మంది మహిళల్లో సుమారు 6 నుంచి 7 మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల కూడా నెలసరిలో ఆలస్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి మహిళలు ఇకనైనా మేలుకోండి మీ గురించి మీరు ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే సమయా నుకూలంగా పోషకాల ఆహారం తీసుకోవడంతో పాటు నెలసరిలో అటు ఇటు అయితే తప్పక వైద్యులను సంప్రదించండి. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించక తప్పదు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.