Banana: ఏడాది పొడవునా మనందరికీ అందుబాటు ధరల్లో లభించే అరటిపండును రోజువారి డైట్ లో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున మనలో పోషకాహార లోపం తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, కండర క్షీణత వంటి ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పును తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజువారి డైట్ లో అరటిపండును తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది . కావున గుండెకు రక్త సరఫరా ఆక్సిజన్ పుష్కలంగా లభించి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిపండులో ఉండే డెంటరి ఫైబర్ జీర్ణ వ్యవస్థ లోపాలను సవరించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది దాంతో మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక ప్రోటీన్స్, ఫైబర్ కలిగిన అరటిపండును ఆహారంగా తీసుకుంటే డయాబెటిస్ వ్యాధిని కూడా నియంత్రణలో ఉంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు బాగా పండిన అరటిపండును తినకూడదు.
అల్సర్ సమస్యతో బాధపడేవారు భోజనం తిన్న వెంటనే అరటిపండును ఆహారంగా తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజువారి డైట్ లో అరటిపండును తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్లు తొలగిపోయి కిడ్నీ సామర్థ్యం మెరుగు పడుతుంది. అరటి పండులో సమృద్ధిగా లభించే మెగ్నీషియం, జింక్, మాంగనీస్ వంటి మూలకాలు మెదడు కణాలను శాంత పరిచి మానసిక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.