Bahubali-The Epic: ‘బాహుబలి ది ఎపిక్’ నుంచి కొత్తగా ఆశించారో మటాష్

Bahubali-The Epic: ‘బాహుబలి ది ఎపిక్’ నుంచి కొత్తగా ఆశించారో మటాష్ అంటున్నారు సినీ లవర్స్. అవును, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా ఫ్రాంఛైజీస్ ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కన్‌క్లూజన్’. ఈ సినిమాలతో మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు రాజమౌళి. ఆయన ప్రతీ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్-రానా దగ్గుబాటిలతో ఆయన ‘బాహుబలి’ ఫ్రాంఛైజీస్ ని రూపొందించారు.

అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మన తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. ప్రభాస్ కి ఏకంగా పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కింది. అయితే, ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

bahubali-the-epic-dont-expect-new-scenes-and-songs

Bahubali-The Epic: క్వాలిటీ రెట్టింపు స్థాయిలో ఉందని చెప్తున్నారు.

కొన్ని సీన్స్, సాంగ్స్ ని తీసేసి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31, 2025న రిలీజ్ చేశారు. దీనికంటే ఒకరోజు ముందు ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఈ షోస్ చూసిన ప్రతీ ఒక్కరు కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఏవీ లేవు కానీ, సినిమా మాత్రం బావుంది అంటున్నారు. ఫస్టాఫ్ లో ఎక్కువగా కాలకేయ ఏపిసోడ్ ఉండగా, సెకండాఫ్ లో అనుష్క కి సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. ఇక క్వాలిటీ రెట్టింపు స్థాయిలో ఉందని చెప్తున్నారు.

ఇక, ఈ సినిమా గురించి కొందరు ఫారిన్ ప్రేక్షకులు ‘బాహుబలి’ పార్ట్ 1 వచ్చి పదేళ్ళు అవుతోంది. అప్పటికి, ఇప్పటికీ టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే బాహుబలి ది ఎపిక్ లో కొత్తగా ఫీలవడానికి ఏమీ లేదంటున్నారు. రెండు పార్టులను కలిసి ఒక పార్ట్ గా చేయడానికి సూపర్ హిట్ సాంగ్స్ ని, కొన్ని మంచి సీన్స్ ని తీసేశారు తప్ప, కొత్తగా ఏవైనా సీన్స్ గానీ, సాంగ్స్ గానీ యాడ్ చేశారా అంటే అలాంటిదేమీ జరగలేదంటున్నారు. ఏదేమైనా ‘బాహుబలి ది ఎపిక్’ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో సంచలనం సృష్ఠిస్తోంది. ఓ రీ రిలీజ్ సినిమాకి ఈ రేంజ్ లో టికెట్స్ సేల్ అవడం కొత్త రికార్డ్ అంటున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.