Spiritual: సాధారణంగా మనం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను అలాగే వాస్త నియమాలను పాటిస్తూ ఉంటాము ఇలా వాస్తు ధర్మాన్ని పాటించేవారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తుంటారు అయితే చాలామంది తమ సిరి సంపదల కోసం లేకపోతే జాతకంలో దోషాలను తొలగించుకోవడం కోసం వివిధ రకాల ఉంగరాలను ధరిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే తాబేలు విగ్రహం ఉన్నటువంటి ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు. ఇలా తాబేలు ఉన్నటువంటి విగ్రహం ధరించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన పైనే ఉంటాయని సిరిసంపదలు ఉంటాయని భావిస్తారు.
ఇలా తాబేలు ఉంగరం ధరించే సమయంలో ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అయితే తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పొరపాట్లు చేయకూడదనే విషయానికి వస్తే.. తాబేలు డిజైన్ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించేటప్పుడు సరైన మార్గంలోనే ధరించాలి. తాబేలు తల ఎల్లప్పుడూ కూడా మీ వైపుకు ఉండేలా తోక వేళ్ళ వైపు ఉండేలా చూసుకోవాలి.
తాబేలు లక్ష్మీదేవితో ముడపడి ఉండటం వలన ఈ ఉంగరాన్ని శుక్రవారం పూట ధరించడం చాలా మంచిది. ఇక ఈ ఉంగరం ఎల్లప్పుడు కూడా ఉంగరపు వేలికే ఉండాలి. ఇక తాబేలు ఉంగరం ధరిస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కదా అని బద్ధకం చేయకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలని ఎలాగైతే తాబేలు నిదానంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందో మన జీవితంలో కూడా పురోగతి అలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.