Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ననమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకున్నప్పటికీ, అందం, అభినయంతో మాత్రం ప్రేక్షకులను, మేకర్స్‌ను ఆకట్టుకుంది. దీంతో, కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమాలో మిడిల్ ఏజ్ క్యారెక్టర్ చేసింది.
ఈ సినిమా హిట్ సాధించింది. ఇక, అందరి చూపు ఆషికా మీదే పడింది. వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘నా సామిరంగ’ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా తర్వాత కమిటైన భర్త మహశయులకు విజ్ఞప్తి సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ఆషికా, బికినీ అందాలతో అదరగొట్టింది. అల్ట్రా మోడ్రన్ రోల్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆషిక రంగనాథ్ సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందని టాక్ వినిపిస్తోంది.
ఆషికా రంగనాథ్‌లో ప్లస్ పాయింట్ మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు ఇటు సీనియర్ హీరోలకి, అటు యంగ్ హీరోలకి సరిపోయే అందం, పర్సనాలిటీ ఉన్న భామ. అందుకే.. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అవకాశాలను అందుకుంటోంది. ‘గత వైభగం’ లాంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలను ఒప్పుకొని తన సత్తాను చాటుతోంది. ఈ సంక్రాంతికి మస్ మహారాజ రవితేజ సరసన నటించిన ‘భర్త మహాశయులకువిజ్ఞప్తి’ సినిమా ఆషికా రంగనాథ్‌కి మంచి పేరే తెచ్చింది.
శర్వానంద్‌కి జంటగా ఆషికా?
యంగ్ హీరో శర్వానంద్ ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో వచ్చి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం, ‘బైకర్’..’భోగి’ చిత్రాలను చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు. త్వరలో, ఈ మూవీ సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా ఆషికా రంగనాథ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో శర్వానంద్‌పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఇక, ఈ మూవీలో శర్వా మేకోవర్ చాలా కొత్తగా ఉంటుందట. కాగా, ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ను ఫైనల్ చేసినట్టుగా అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
Puri-Slum Dog: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని ఫిక్స్…
This website uses cookies.