Inspiring: ప్రపంచం నా కంటే గొప్ప ప్రేమికుడు నీకు ఎప్పటికి దొరకడు… ప్రపంచంలో నాలా ప్రేమించే అమ్మాయి నువ్వు ఎప్పటికి పొందలేవు. ఎవరికి వారు తాము ప్రేమించిన వ్యక్తులతో ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా ఈ మాట చెబుతారు. ప్రేమించే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. అయితే ఆ ప్రేమని స్వీకరిస్తున్న ఎదుటివారికి అది గొప్ప ప్రేమ కాదా అనే విషయం మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఆ విషయాన్నే వారు తెలిజేసే సమయంలో ఇగో హార్ట్ అవుతుంది. బ్రేక్ అప్ అవుతుంది.
నిజానికి ప్రపంచంలో ప్రతి బ్రేక్ అప్ ఎవరో ఒకరి స్వార్ధం వలనే జరుగుతాయి అంటే నమ్మకపోవచ్చు. కానీ నిజం. ఒక్కసారి ప్రేమిస్తే, ఆ ప్రేమించే వ్యక్తిని జీవితంలో వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాని వదులుకోవడానికి రెడీ అయ్యారంటే మాత్రం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ప్రేమ లేదని, కేవలం కోరిక, ఆశ మాత్రమే ఉందని అర్ధం. ప్రేమ అనేది ఈ అనంత విశ్వంలో అతీతమైనది. ఈ ప్రేమని అర్ధం చేసుకోవడానికే ఈ మానవ సమాజంలో చాలా మందికి సాధ్యం కావడం లేదు.
తనకి నచ్చినట్లు ప్రేమించే వ్యక్తి ఉండాలని అనుకుంటారు. తాను చెప్పింది వినాలని ఆశిస్తారు. తన మాటకి విలువ ఇవ్వాలని భావిస్తారు. అన్నింటికీ మించి తన ఇగోని సంతృప్తి పరిస్తేనే వారు మన ప్రియుడు లేదా ప్రియురాలిగా ఉండటానికి అర్హత ఉందనే విధంగా భావిస్తారు. ఆ ఆలోచనలకి వారు పెట్టే పేరు మంచితం, సమాజంలో గౌరవం, మన సంతోషం కోసమే కదా ఇదంతా అని. నిజానికి అక్కడ ప్రేమ కంటే ఆధిపత్యమే ఉంటుంది. తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి తాను బాస్ లా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ బాసిజం ఉన్న చోట పెత్తనమే ఉంటుంది కాని ప్రేమ ఉండదు.
ప్రేమ ఉన్న చోట పెత్తనం అనే మాటకి చోటుండదు. ప్రేమ అనేదానికి సరైన ప్రపంచంలో సరైన నిర్వచనం అంటే ఒకటే ఉంటుంది. ఓ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే వారి మధ్య కండిషన్స్ ఉండవు, మాటల్లో నెగిటివ్ ఇంటెన్షన్ ఉండదు. ఇచ్చేదానికి రీజన్ ఉండదు.అన్నింటికీ మించి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమలో కనిపించే స్వచ్చమైన భావం. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారా అలా అయితే మీరు నిజమైన ప్రేమికుడు. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారా అలా అయితే మీరు నిజమైన ప్రియురాలు. కండిషన్స్, ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తే అలాంటి వారు మాత్రమే నిజమైన ప్రేమికులు. వీరిలో మీరు ఉన్నారా లేదా అనేది ఇప్పుడే నిర్ణయించుకోండి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.