Anup Rubens: టాలెంట్ ఉంటే చర్చిలో కీ బోర్డ్ వాయించే వాడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వొచ్చు

Anup Rubens: సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కంటే కూడా కొన్నిసార్లు టాలెంట్ అవకాశాలు వచ్చేలా చేస్తుంది. దీనిని కొందరు దేవుడి దయ అని నమ్ముతుంటారు. ఏదేమైనా కష్టే ఫలి. మనసుపెట్టి కష్టపడితే సక్సెస్, పాపులారిటీ, డబ్బు అవే వస్తాయని అనుభవజ్ఞులు చెబుతుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇతర భాషలలో కూడా వెనక ఎవరో ఒకరు ఉంటేనే సక్సెస్ అవుతుంటారు.

కొంతమంది హీరోలు, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఇది అర్థమవుతుంది. కానీ, ఇప్పుడు మంచి సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన అనూప్ రుబెన్స్ మాత్రం కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన క్రిష్టియన్. ప్రతీ ఆదివారం చర్చీలలో పాటలు పాడేవారు. అలాగే ఆ పాటలకి తగ్గట్టుగా కీ బోర్డ్ ప్లే చేస్తుండేవారు. ఆయన గొంతు వినడానికి బావుంటుంది. సింగర్ గా మంచి లైఫ్ ఉందని చాలామంది సలహా ఇచ్చేవారు.

anup-rubens-a-person-who-plays-the-keyboard-in-the-church-can-also-become-a-music-director-if-he-has-talent

Anup Rubens: తేజ దృష్ఠిలో పడ్డాడు అనూప్ రుబెన్స్.

అలా కొత్త వారికి అవకాశం ఇచ్చే దర్శకుడు తేజ దృష్ఠిలో పడ్డాడు అనూప్ రుబెన్స్. ఆయన దర్శకత్వంలో వచ్చిన జై, ధైర్యం సినిమాలకి సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్ సాధించాయి. ఆ తర్వాత అనూప్ నుంచి ద్రోణ, నేను నా రాక్షసి, ప్రేమ కావాలి, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, మనం, పైసా వసూల్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్ వచ్చాయి.

ఒకప్పుడు చక్రి సినిమా మ్యూజికల్ గా ఎంతటి హిట్ సాధించేదో అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందించిన సినిమాలు అలా సక్సెస్ సాధిస్తూ వచ్చాయి. అంతేకాదు, చాలా స్పీడ్‌గా 50 సినిమాలు పూర్తి చేసిన ఘనత అనూప్ కి దక్కింది. మణిశర్మ, ఎస్ ఎస్ థమన్, దేవీశ్రీప్రసాద్, గోపీ సుందర్, అనిరుధ్ లాంటి వారు ఉన్నా అనూప్ రుబెన్స్ కి మాత్రం మంచి సినిమాలకి సంగీతం అందించే అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ టాలెంట్ ఉండాలేగానీ, అనూప్ మాదిరిగా ఎంతో మంది జెండా ఎగరేయవచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

5 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.