Anshu-Laya-Genelia: రీ ఎంట్రీ వేస్ట్..? ఒక్కరికీ హిట్ పడలేదు..

Anshu-Laya-Genelia: టాలీవుడ్‌లో ఈ ఏడాది ముగ్గురు భామలు.. అన్షు, లయ, జెనీలియా.. కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. వీరి తిరిగి రావడం భారీ హంగామాతో జరిగినా, ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లభించలేదు. ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో వీరి రీ-ఎంట్రీ “బిట్టర్‌స్వీట్” (తీపి చేదు) అనుభవంగా మారింది.

అన్షు: 22 ఏళ్ల తర్వాత ‘మజాకా’తో రీ-ఎంట్రీ
‘మన్మథుడు’తో తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి, ‘రాఘవేంద్ర’లో ప్రభాస్ సరసన నటించిన అన్షు, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఏకంగా 22 ఏళ్ల తర్వాత ఆమె ‘మజాకా’ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సందీప్ కిషన్‌కి పిన్ని పాత్రలో, రావు రమేశ్ సరసన నటించారు. అయితే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద తడబడినా, ఓటీటీలో మాత్రం మంచి స్పందన అందుకుంది. ప్రమోషన్ల సమయంలో తలకు గాయం అయినా అన్షు ప్రాథమిక చికిత్స తర్వాత ప్రమోషన్లలో పాల్గొనడం హైలైట్‌గా మారింది. అయినా సినిమా ఫలితం నిరాశ కలిగించింది. ప్రస్తుతం ఆమెకి కొత్త ఆఫర్లు రాలేదు.

లయ: 18 ఏళ్ల తర్వాత ‘తమ్ముడు’తో తిరిగి..
అన్షుతో పోల్చితే తెలుగు పరిశ్రమలో మరింత ముద్ర వేసిన నటి లయ. నంది అవార్డు విజేత అయిన లయ వివాహానంతరం అమెరికాలో సెటిల్ అయిపోయారు. అయితే, దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆమె ‘తమ్ముడు’ సినిమాతో తెరపైకి వచ్చారు. ఇందులో హీరో నితిన్ అక్కగా నటించారు. ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్న లయ ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశించారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల భవిష్యత్తులో అవకాశాలుండే అవకాశం ఉంది.

జెనీలియా: ‘జూనియర్’తో నిరాశ
గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌తో వివాహానంతరం సినిమాలకు విరామం తీసుకున్నారు. అయితే శుక్రవారం విడుదలైన ‘జూనియర్’ చిత్రంతో ఆమె రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో కిరిటీ సోదరిగా నటించారు. స్క్రీన్‌పై ఆమె ప్రెజెన్స్ బాగున్నా, కథాబలం లేకపోవడం వల్ల సినిమా పట్టు సాధించలేకపోయింది. జెనీలియా కూడా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్నారు కానీ, ఆమె పెట్టుకున్న ఆశలు వృథా అయ్యాయి.

anshu-laya-genelia-re-entry-waste-no-one-got-a-hit

Anshu-Laya-Genelia: గత గుర్తింపు మాత్రమే సరిపోదు!

గత గుర్తింపు మాత్రమే సరిపోదు!
మొత్తంగా చూసుకుంటే, ఈ ముగ్గురు భామల రీ-ఎంట్రీలు సినీ పరిశ్రమలో శబ్దం చేసినా, ఫలితాల పరంగా మెప్పించలేకపోయాయి. వీరి కథలు ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నాయి—గత గుర్తింపు మాత్రమే సరిపోదు, తిరిగి సక్సెస్ సాధించాలంటే కథ, కథనం, ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ ముగ్గురు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.