Fish Venkat: రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..పాపం అంత తక్కువా..?

Fish Venkat: సినిమా ప్రేక్షకులను తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో, విలన్ రోల్‌లోనూ నవ్వులు పంచే నటనతో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (వయసు 53) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జులై 18న రాత్రి హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ అతనిపై కనీస అనుబంధం కనబరిచే ఒక్క సినీ ప్రముఖుడూ ముందుకు రాకపోవడం పెద్ద చర్చగా మారింది.

ఫిష్ వెంకట్‌ తొలి సినిమా పవన్ కల్యాణ్ ‘ఖుషి’ (2001) కాగా, 2002లో ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ చిత్రంలోని “తొడకొట్టు చిన్నా..” అనే డైలాగ్‌తో అతనికి పాపులారిటీ వచ్చింది. అప్పటి నుంచి దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, కింగ్, దరువు, సుప్రీమ్, మిరపకాయ్ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రల్లోనూ తన మార్క్ కామెడీ, మేనరిజంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. దర్శకుడు వీవీ వినాయక్ తన ప్రతీ సినిమాలో ఫిష్ వెంకట్‌ను ఒక రౌడీ గ్యాంగ్ మెంబర్‌గా కచ్చితంగా తీసుకునేవారు.

fish-venkat-do-you-know-how-much-remuneration-is-but-is-it-so-little

Fish Venkat: కెరీర్ ప్రారంభంలో రోజుకు రూ. 2,000..?

కెరీర్ మోస్తరుగా నడుస్తుండగానే షుగర్, కిడ్నీ సమస్యలు, కాలుకు ఇన్‌ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. నాలుగేళ్ల క్రితం శస్త్రచికిత్స తర్వాత కొంతవరకు కోలుకున్నా, సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో బోడుప్పల్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో కొందరు ప్రముఖులు అండగా నిలిచినప్పటికీ, కిడ్నీ దాత దొరకకపోవడం ప్రధాన సమస్యగా మారింది. చివరకు పరిస్థితి విషమించి మృతి చెందారు.

వెంకట్ డిమాండ్ ఉన్న నటుడే అయినా.. రెమ్యూనరేషన్ మాత్రం తక్కువగానే ఉండేది. కెరీర్ ప్రారంభంలో రోజుకు రూ. 2,000, తరువాత ఒక్కో సినిమాకు రూ. 30,000 వరకు తీసుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కుటుంబ అవసరాలకు ఇది సరిపోయినా, శస్త్రచికిత్సలు, డయాలసిస్ వంటి ఖర్చులకు ఇది ఎక్కడా చాలు కాదు. చివరి రోజుల్లో ఆరోగ్యమే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

వెంకట్ భార్య స్పందిస్తూ – “ఆపరేషన్ తర్వాత మద్యం, ధూమపానం మానేయమన్నాం. వినలేదు. కొంతమంది స్నేహితులే వచ్చి మళ్లీ అలవాటు పెట్టించారు. చివరకు ఆసుపత్రిలో ఉన్నా, ఒక్క సినీ ప్రముఖుడు చూసేందుకు రాలేదు. కుటుంబమే ఒంటరిగా పోరాడింది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

వందల సినిమాల్లో నటించిన కళాకారుడు, ప్రేక్షకులను నవ్వించిన నటుడు.. చివరికి ఆసుపత్రి బెడ్ మీద ఒంటరిగా పోరాడుతూ, ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ చనిపోవడం ఎంత వేదనకరం! ఫిష్ వెంకట్‌కు తగిన గుర్తింపు ఆయన బ్రతికున్నప్పుడే దక్కాల్సింది. అయినా ఆయన నటన, డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన శైలి సినిమాల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో ఉండిపోతుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.