Animal Review: విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023
నాతెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు
దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని
సంగీతం: జాం8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా యానిమల్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో అర్జున్ రెడ్డి, అదే సినిమాలో బాలీవుడ్ లో కబీర్ సింగ్‌గా తీసి సంచలనం సృష్ఠించిన సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన యానిమల్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథ:
రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్)కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే చెప్పలేనంత ప్రేమ. కానీ, బల్బీర్ సింగ్ పెద్ద బిజినెస్ మెన్ కావడంతో ఆయన అసలు కొడుకుకి సమయం ఇవ్వలేకపోతాడు. ఇండియాలోనే పెద్దదైన స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ వస్తుంది. ఈ క్రమంలోనే తన కొడుకుని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు బల్బీర్. ఆ తర్వాత కొన్ని కామన్ సీన్స్.. రణ్ విజయ్ సింగ్, గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడటం..అమెరికాకి వెళ్లిపోవడం జరుగుతాయి. ఇంత్లో బల్బీర్ పై హత్యాయత్నం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న రణ్ విజయ్ మళ్ళీ, తిరిగి దేశానికి వస్తాడు. అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకున్న వారెవరు..? ఆ శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..అనేది ఆ తర్వాత జరిగే కథ.
ప్లస్ పాయింట్స్ :
రణబీర్ కపూర్ ఈ సినిమాను తన భుజాల మీద వేసుకున్నాడని యానిమల్ చూశాక అర్థమవుతుంది. తన పాత్ర తగ్గట్టు ఏ సన్నివేశంలో ఎలా నటించాలో అలాగే నటించి ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ లో విజయ్ అద్భుతంగా చేశాడు. అలాగే రన్‌బీర్ కి తండ్రిగా నటించిన అనిల్ కపూర్ పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్. తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. బాబీ డియోల్ తన పాత్ర మేరకు న్యాయం చేశాడు. హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న కొన్ని సీన్స్ కే పరిమితం అన్నట్టుగా కనిపించింది.
మైనస్ పాయింట్స్:
తండ్రి పై తనకున్న ప్రేమ కోసం ఒక కొడుగా ఏం చేశాడు అనే నేపథ్యంలో సాగిన యానిమల్ లో కథ బలంగా లేదు. రివేంజ్ కోసమే సినిమా అంట్టుగా ఉంది తప్ప..ఆశించిన కథ, కథనాలు మాత్రం యానిమల్ సినిమాలో కరువయ్యాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సన్నివేశాలను పర్ఫెక్ట్ గా రాసుకోలేదు. యాక్షన్ సినిమా అనేదే మైండ్ లో పెట్టుకొని కథ, కథన, ఎమోషన్స్ మీద అంతగా దృష్టి పెట్టలేది. ఎండింగ్ కూడా ఫ్లాటైపోయింది. దాంతో భారీ అంచనాల మధ్య రిలీజైన యానిమల్ నిరాశపరుస్తుంది.
సాంకేతిక విభాగం :
కథ, కథనాలు అంత బలంగా లేకపోవడం వల్ల దాని ప్రభావం మ్యూజిక్ అండ్ ఆర్ ఆర్ మీద పడింది. సాంగ్స్ కూడా సో సోగా ఉన్నాయి. సినిమాలో బాగా అనిపించేది ఫొటోగ్రఫీ. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి.
ఫైనల్‌గా:
యానిమల్ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుందని అర్జున్ రెడ్డి సినిమా కంటే మంచి రొమాన్స్ ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ బాండింగ్ బావుంటుందని హైప్ ఇచ్చిన సందీప్ రెడ్డి బాగా డిసప్పాయింట్ చేశాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.