Animal: సందీప్‌రెడ్డి వంగా..ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఒకే కథతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అయితే, తెలుగులో ఆయనకి స్టార్ హీరోలు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించారు. దీనికి కారణం ఆయన విజయ్ దేవరకొండ, శాలినీ పాండేలతో తీసిన సంచలన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో ఇంటెన్సివ్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే.
అందుకే, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా కథ చెబితే సింపుల్‌గా నో అన్నారు. అయితే, బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ అని రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ హిట్ అందుకోవడమే కాదు, హీరో హీరోయిన్స్ షాహిద్ కపూర్, కియారా అద్వానీలకి అసాధారణమైన సక్సెస్ ని ఇచ్చారు. దాంతో హిందీలో సందీప్ మార్కెట్ బాగా పెరిగింది.
ప్రస్తుతం రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా యానిమల్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్‌కి ఈ సినిమా రెడీ అవుతోంది. అయితే, అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్నట్టే యానిమల్ సినిమాలోనూ ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. ముఖ్యంగా ముద్దు సీన్స్ హైలెట్ అని చెప్పుకుంటున్నారు. దాంతో అసలు ఏం చెప్పి హీరోయిన్స్ తో సందీప్ లిప్ కిస్సులకి ఒప్పిస్తున్నాడని ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే.. అప్పుడు షాలినీ పాండేకి గానీ, ఇప్పుడు రష్మిక మందన్నకి గానీ ముద్దు సీన్స్ గురించి మర్చిపోండి. ఎందుకంటే ఆ సీన్స్ లో నటిస్తున్నారంతే. అక్కడ ఉంది మీరు కాదు..మీ క్యారెక్టర్. క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప మీరు కాదు..అని లాజికల్‌గా చెప్పి ఒప్పించారట. కథ, కథలోని పాత్రల విషయంలో సందీప్ చాలా క్లియర్‌గా ఉంటారు. అందుకే, ఈ ఇద్దరు హీరోయిన్స్ లిప్ కిస్సులకి ఓకే చెప్పారట.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.