Animal : వామ్మో మరీ అన్ని గంటలా..!యానిమల్ రన్ టైంపై క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ

Animal : సందీప్ వంగ.. ఈ పేరు వినగానే అర్జున్ రెడ్డి సినిమా కళ్ళముందుకు వస్తుంది. ఫస్ట్ మూవీ తోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్ వంగ. అయితే అర్జున్ రెడ్డి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సందీప్ ఏకంగా ఇప్పుడు బాలీవుడ్ లో మకాం వేశాడు. బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్తో యానిమల్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక హీరోయిన్గా కనిపించనుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మూవీ లవర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

animal-director-sandeep-reddy-vanga-gave-clarity-on-movie-runtime

అయితే తాజాగా ఈ సినిమా రన్ టైంకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రన్ టైంపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. యానిమ‌ల్ సినిమా ర‌న్ టైమ్ 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లు ఉంటుంది అంటూ సోష‌ల్ మీడియా లో అనౌన్స్ చేశాడు.

 

animal-director-sandeep-reddy-vanga-gave-clarity-on-movie-runtime

ఈ మధ్య కాలంలో విడుదల అయిన సినిమాల్లో ఎక్కువ డ్యూరేషన్ ఉన్న బాలీవుడ్‌ చిత్రంగా యానిమల్ నిలవనుంది. దీంతో అందరూ ఎన్ని గంటలు సినిమా చూడాలా అంటూ కామెడీగా కామెంట్స్ పెడుతున్నారు. 2016లో విడుదలైన ‘ధోనీ’ తర్వాత 3 గంటలకు పైగా డ్యూరేషన్ ఉన్న హిందీ చిత్రం ఇదే . దీన్ని చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే ఇది సందీప్ రెడ్డి సినిమా కావడంతో ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

animal-director-sandeep-reddy-vanga-gave-clarity-on-movie-runtime

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా హిట్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. తనదైన స్టైలిష్ డైరెక్షన్ తో అందరిని ఫిదా చేశాడు. బోల్డ్ కంటెంట్ తో అందరి మైండ్ బ్లాక్ చేశాడు. తెలుగులో ఇదివరకెన్నడు ఏ డైరెక్టర్ చేయని సాహసాలు ఎన్నో కూడా ఈ మూవీలో చేశాడు. డైరెక్టర్ విజన్ కు తగ్గట్లుగా విజయ్ దేవరకొండ తన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు. మాసు క్లాసు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రన్బీర్ వంతు. ఇప్పటికే విడుదలైన యానిమల్ ప్రోమోలు, టీజర్లు, సాంగ్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. సినిమాకు ఓ రేంజ్ హైప క్రియేట్ అయింది. మరి సందీప్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడా లేదా అన్నది మాత్రం డిసెంబర్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 hour ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

3 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

This website uses cookies.