గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీల తరపున తలపడటంతోనే అసలు కథ మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా తమ్ముడు చిన్ని, వైసీపీ అభ్యర్థిగా అన్న నాని విజయవాడ ఎంపీ సీటు కోసం హోరాహోరీగా పోటీ పడ్డారు. ఆ పోరులో తమ్ముడి చేతిలో అన్న ఘోర పరాజయం పాలయ్యారు. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది దాటుతున్నా వీరి మధ్య ఉన్న రాజకీయ, వ్యక్తిగత విభేదాలు మాత్రం చల్లారలేదు సరే కదా.. మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆస్తులు, వ్యాపారాలు, బినామీ వ్యవహారాల చుట్టూ తిరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం తాజాగా మరో మలుపు తిరిగింది.
చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడ పటమట పోలీసులు రంగంలోకి దిగారు. కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఐటీ యాక్ట్ కింద అత్యంత కఠినమైన క్రిమినల్ సెక్షన్లను నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న నానికి.. తమ్ముడు చిన్ని లీగల్ రూట్‌లో ఇచ్చిన ఈ షాక్ బెజవాడ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది. మరి ఈ బ్రదర్స్ వార్ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.