Anchor Suma : బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. గత రెండు దశాబ్దాలుగా తన యాంకరింగ్ తో , మాటల మంత్రాతో బుల్లితెరను ఏలుతోంది. టెలివిజన్ లో కొత్త కొత్త యాంకర్లు ఎంత మంది వచ్చినా, మోడ్రన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నా సుమను మాత్రం ఎవరూ ఢీ కొట్టలేకపోతున్నారు. కేరళ కుట్టీ అయినప్పటికీ తెలుగులో అనర్గలంగా మాట్లాడుతూ, యాంకరింగ్ కే వన్నె తీసుకువచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో యాంకర్ గా సుదీర్ఘకాలం కొనసాగడం గొప్ప విషయం. ఇక తాజాగా సుమ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ కామెంట్ ను జత చేసింది. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చితం అనుభవిస్తున్నాను అని చెపి అందరినీ అవాక్కు చేసింది. ఇంతకి సుమ చేసిన తప్పేంటని తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. నెట్టింట్లో ఈ వీడియోతో పాటు సుమ క్యాప్షన్ వైరల్ అవుతోంది.
సుమ కనకాల సొంతూరు కేరళ. ఉద్యోగరీత్యా ఆమె ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. మొదట్లో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చింది. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఈ రంగం సుమకు బాగా పేరు తీసుకువచ్చింది. యాంకర్ లోనే హిస్టరీ క్రియేట్ చేసింది. సమయస్ఫూర్తి, తెలుగు భాషపై పట్టు ఉండటంతో పాటు ఎనర్జీ లెవెల్స్ అమేజింగ్ గా ఉండటంతో సుమకు తెలుగులో ఎనలేనంత క్రేజ్ ఉంది. ఇక సుమ సెన్సాఫ్ హ్యూమర్ కు ఎవరైనా పడిపోవాల్సిందే. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. యాంకరింగ్ తోనే కాదు సినిమా ఈవెంట్లతో , సెలబ్రిటీల ఇంటర్వ్యూలతోనూ 40 ప్లస్ వయసులోనూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది సుమ.
ఇక ఈ బ్యూటీ ప్రపంచంలో యాంకరింగ్ కు ముఖ్యంగా కావాల్సింది అందం. ఇప్పుడిప్పుడే బుల్లితెరకు వస్తున్న యాంకర్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ వారి పాట్లు వారు పడుతున్నాయి. ఈ క్రమంలో వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు సుమ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ తో ఫోటో షూట్స్ చేయడం తో పాటు జిమ్ వర్కౌట్లు చేస్తూ సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది. లేటెస్టుగా సుమ ఒక వీడియో షేర్ చేసింది. ఉగాది రోజు డైట్ పక్కన పెట్టేసి ఫుడ్ గట్టిగా లాగించేసిందట. అందుకు శిక్షగా వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. పండుగ రోజు పులిహోర, పొంగలి, గారెలు, పాయసం గట్టిగా లాగించేశాను, వాటిని కరిగించడానికి ఈ పాట్లు అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది సుమ. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ వయసులో నీకు అవసరమా? అంటూ కొంత మంది నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఇక సుమ అభిమానులు మాత్రం పాజిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.