Ananya Nagalla: అసలు కమిట్మెంట్ అడుగుతారని మీకెలా తెలుసు..? అని తాజాగా యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఓ విలేఖరిని అడగడం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటిలో సినీ తారలను ఇంటర్వ్యూ చేస్తూ ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ అడిగారా..మీరు ఒప్పుకున్నారా..లాంటి ప్రశ్నలగడం హాట్ టాపిక్ అవుతోంది.
అందుకే, చాలామంది యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ అంటేనే ఫోన్ ఎత్తడం మానేస్తున్నారు. లేదా ఏదో ఒక కారణం చెప్పి ఇంటర్వ్యూ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. గతంలో ఏ సెలబ్రిటీ అయినా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చేవారు. తమ గురించి అభిమానులకి, ప్రేక్షకులకి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోవాలని ఆసక్తి చూపేవారు.
కానీ, రాను రాను కొన్ని ఛానల్స్ మరీ దిగజారి బాత్రూం, బెడ్రూం లో జరిగే విషయాలను కెమెరా ముందు ప్రస్తావించడం, ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఉంది కదా..మిమ్మలిని ఎవరు అడగలేదా..? అని ప్రశించడం చాలా సాధారణం అయిపోయింది. దాంతో కొన్ని సందర్భాలలో సెలబ్రిటీస్ కూడా మొహం మీద కొట్టినట్టే సమాధానం చెప్పాల్సి వస్తోంది.
‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాలతో బాగా పేరు తెచ్చుకున్న యువనటి అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైల రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈవెంట్ కి వచ్చిన అనన్యతో ఒక విలేఖరి సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాకి సైన్ చేసే ముందుకు ఖచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారు కదా..! మీకెప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైందా..?’ అని అడిగారు.
దీనికి ‘అసలు ఒక సినిమా సైన్ చేసే ముందుకు కచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారనే విషయం మీకెలా తెలుసు.. అదంతా కేవలం బయట మాట్లాడుకునేవే. అలాంటివి ఇండస్ట్రీలో ఎక్కడో జరుగుతుంటాయి. నాకైతే ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఎదురవలేదు..’ అని బాగానే సమాధానమిచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, అనన్య నటించిన మరో చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఈ ఏడాదిలోనే విడుదలకి సిద్ధమవుతోంది. అలాగే హాట్‌స్టార్ కి ఓ సిరీస్ చేయనున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.