Watermelon: ప్రతి సీజన్లోనూ మనకు ఎన్నో రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే వేసవికాలం వచ్చిందంటే మనకు మార్కెట్లో ఎక్కడ చూసినా పుచ్చకాయలు కనపడుతూ ఉంటాయి. పుచ్చకాయ వేసవి కాలంలో తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పుచ్చకాయలు అధికంగా నీటి శాతం ఉంటుంది కనుక డీహైడ్రేషన్ కి గురి కాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ఇకపోతే చాలామంది పుచ్చకాయలో కాస్త ఉప్పు కలుపుకొని తింటూ ఉంటారు.
ఈ విధంగా పుచ్చకాయలు ఉప్పు కలుపుకొని తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఒకవేళ కలుపుకొని తింటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే..పుచ్చకాయ జ్యుసి ఫ్రూట్ కాబట్టి, పుచ్చకాయలో ఉప్పు కలిపితే దానిలో నీటిశాతం పెరుగుతుంది. పుచ్చకాయ తక్కువ కేలరీల పండు. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో లైకోపీన్, ఇతర పోషకాలు ఉంటాయి.
ఇలా ఇన్ని పోషకాలు ఉన్నటువంటి ఈ కాయలో ఉప్పు కలుపుకొని తినటం వల్ల మూలకాలు మరింత చురుకుగా ఉంటాయి. ఈ పోషకాలను శరీరం మరింతగా గ్రహించడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల దాని పోషణపై పెద్దగా ప్రభావం ఉండదు. అలా కాకుండా రోజంతా ఇలా తింటూ ఉంటేనే మన శరీరంపై సోడియం ప్రభావం పెరిగి ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది కనుక తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.