Amala Paul: సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోడాలు, పెళ్లి చేసుకోడాలు ఆ తర్వాత కొంత కాలానికి విడిపోవడాలు చాలా కామన్ అయిపోయాయి. అమలా పాల్, రష్మిక మందన్న లాంటి వారైతే ఎంగేజ్‌మెంట్ తర్వాత కెరీర్ కోసమో, లేక వ్యక్తిగత కారణాల వలనో ముందే పెళ్లి రద్దు చేసుకుంటున్నారు. సమంత, నాగ చైతన్య లాంటి క్యూట్ కపుల్ కొంతకాలం అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేసి ఊహించని రీతిలో విడిపోతున్నారు.
అమలా పాల్ కూడా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, కారణాలు తెలియదు గానీ పెళ్ళైన మూడేళ్ళకే అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఆమె లాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసి అటు తమిళ్మలో ఇటు తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఇదే కాదు, అమలా తెలుగులో నటించిన ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి ప్రేక్షకాధరణ పొందాయి.
కానీ, కోలీవుడ్..టాలీవుడ్ ఇండస్ట్రీలలో అమలా కెరీర్ ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. దాంతో వెబ్ సిరీస్ వైపూ అడుగులు వేసింది. అవి కూడా అమ్మడికి కలిసి రాలేదనే చెప్పాలి. కెరీర్ ఇలా సాగుతున్నా అమలా మాత్రం చక్కగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది. బీచ్‌లలో బికినీ షూట్స్ ధరించి జనాలకి హీటెక్కిస్తోంది. అమలా పాల్ గురించి సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు కూడా ఏమీ లేవనే చెప్పాలి.
అయితే, తాజా సమాచారం మేరకు అమలా పాల్ రెండవ పెళ్లికి సిద్ధమవుతుందట. గోవాలో ఉండే జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అమలా పాల్ ప్రేమించింది. ఆయన అమలాకి డాన్స్ చేస్తూ ప్రపోజ్ చేశాడు. అమలా కిస్ చేస్తూ జగత్ లవ్ ను యాక్సప్ట్ చేసింది. దీనికి సంబందించిన వీడియోను జగత్ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా, అమలా పాల్ ప్రస్తుతం ‘ద్విజ’ అనే సినిమాతో పాటు కొన్ని వెబ్ సిరీస్ కి సైన్ చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.