Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన మన శంకరవరప్రసాద్‌గారు ఫుల్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 260 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 300 కోట్ల క్లబ్‌లో చేరేందుకు అతి చేరువలో ఉంది.
సంక్రాంతి సెలవులు అయిపోయినా కూడా ఈ మూవీ ఇంకా బుకింగ్స్‌లో సత్తా చాటుతోంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఇందులో వెంకటేష్ వెంకీ గౌడ పాత్రలో నటించి సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళాడు. అనిల్ రావిపూడి అనుకున్నట్టుగా మెగాస్టార్‌ను వింటేజ్ మెగాస్టార్‌గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి 9 సినిమాలు చేశాడు. 9వ సినిమానే మన శంకరవరప్రసాద్‌గారు. గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల మార్క్‌ను చేరుకొని 2025 స్టార్టింగ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు కూడా అదే 300 కోట్ల మార్క్‌ను చేరుకోవడం గ్యారెంటీ అని దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఎంతో నమ్మకంగా చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 జపాన్‌లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రమోషన్స్‌కి వెళ్ళాడు అల్లు అర్జున్. వచ్చి రాగానే మెగాస్టార్ మన శంకరవరప్రసాద్‌గారు సినిమాను చూసి తన మినీ రివ్యూ ఇచ్చాడు. ఇలా, తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌లో “మన శంకరవరప్రసాద్‌గారు”.. టీమ్ అందరికీ శుభాకాంక్షలు. బాస్ ఈజ్‌బ్యాక్.. మన మెగాస్టార్ చిరంజీవిగారు మళ్లీ స్క్రీన్ పై కనిపించడం చూసి చాలా ఆనందంగా ఉంది. వింటేజ్ వైబ్స్..అని రాసుకొచ్చాడు బన్నీ. అలాగే, వెంకీమామగారు షోను రాక్ చేశారు.. అని కన్నడలో వెంకీ గౌడ అద్భుతం చేశారంటూ తెలిపాడు. అంతేకాదు, నయనతార..దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గురించి కూడా ఈ ట్వీట్‌లో ప్రస్తావించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
This website uses cookies.